కాంగ్రెస్‌ విముక్త తెలంగాణ: ఎంపీ బూర

Congress is the liberation Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌ విముక్త్‌ భారత్‌ అవుతుందో లేదో తెలియదుగానీ తెలంగాణ పూర్తిగా కాంగ్రెస్‌ విముక్తం కాబోతుందని భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్‌ జోస్యం చెప్పా రు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలను ఆపాలని కోర్టులకు వెళ్లిన కాంగ్రెస్‌ నేతలు ఇప్పుడు ఈవీఎం లపైన కోర్టులను ఆశ్రయిస్తున్నారని ఎద్దేవా చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో ఎమ్మెల్సీ శ్రీనివాస్‌ రెడ్డితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘దేశంలో ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు ప్రవేశ పెట్టిన తర్వాత ప్రపంచానికి మరింత ఆదర్శంగా మారాం. ఆ పార్టీ అధికారంలోకి వచ్చిన చోట ఈవీఎం లను తప్పుబట్టని కాంగ్రెస్‌ నేతలు ఓడి పోయిన చోట మాత్రం తప్పు పడుతు న్నారు. టీఆర్‌ఎస్‌కు, కాంగ్రెస్‌కు ఓట్లలో 15% తేడా ఉన్నా కాంగ్రెస్‌ నేతలు మాట్లాడటం అర్థరహితం. ఆ పార్టీ నేతల ఆరోపణలు ప్రజాస్వామ్య మను గడకే ప్రమాదం. కాంగ్రెస్‌ ప్రభుత్వమే దేశంలో ఈవీఎంలను ప్రవేశ పెట్టింది.

లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ హవా అని అన్ని సర్వేలు సూచిస్తున్నాయి. ఫెడ రల్‌ ఫ్రంట్‌ గురించి అపహాస్యం చేసిన వాళ్లు ఇప్పుడు తమ వైఖరిని సమీక్షిం చుకుంటున్నారు. కాంగ్రెస్, బీజేపీయేతర ఫ్రంట్‌కు మద్దతు పెరుగుతుంది. వచ్చే లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ రాజకీయాల్లో కేసీఆర్‌ కీల కపాత్ర పోషించనున్నారు. రాష్ట్రంలో కలిసి పోటీ చేసిన కాంగ్రెస్, టీడీపీలు ఏపీలో వేర్వేరుగా పోటీ చేస్తున్నాయి. ఏపీలో టీడీపీ నేతలు టీఆర్‌ఎస్‌ను బూచీగా చూపుతూ ఆరోపణలు చేయడం ఆపితే మంచిది’ అని అన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top