విద్యుత్ ఉద్యోగుల ఆందోళన | Concerns of electricity employees | Sakshi
Sakshi News home page

విద్యుత్ ఉద్యోగుల ఆందోళన

May 27 2014 1:48 AM | Updated on Sep 5 2018 1:52 PM

విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు సమ్మె నిర్వహించారు.

మంచిర్యాల టౌన్, న్యూస్‌లైన్ : విద్యుత్ జేఏసీ ఆధ్వర్యంలో మంచిర్యాల విద్యుత్ డీఈ కార్యాలయం ఎదుట సోమవారం ఉద్యోగులు సమ్మె నిర్వహించారు. మెరుపు సమ్మెలో భాగంగా చేపట్టిన సమ్మె రెండో రోజు సోమవా రం ఆందోళన చేపట్టారు. 28 యూనియన్ల నాయకులు సమ్మెలో పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ, గతంలో వి డతల వారీగా జరిపిన చర్చల్లో ఇచ్చిన హామీల అమలు లో ఎక్కడా పురోగతి లేదని తెలిపారు. డిమాండ్లలో కొ న్ని అగ్రిమెంట్లపై యాజమాన్యం సంతకం చేయడంలో మొహం చాటేయడంతో తమకు అన్యాయం జరుగుతోందని పేర్కొన్నారు.

2014 పీఆర్‌సీ అమలు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమా న పనికి సమాన వేతనాలు అందజేయాలనే తదితర డిమాండ్లతో ఈ మెరుపు సమ్మెకు దిగినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలు తలెత్తకుండా చూస్తూ విద్యుత్ వసూళ్లను నిలిపివేశామని, అత్యవసర సమయాల్లో విధులు నిర్వహిస్తున్నామని వివరించారు. సమ్మెలో విద్యుత్ జేఏసీ నాయకులు, 1104 యూనియన్ జిల్లా అధ్యక్షుడు దుండె కొండయ్య, డివిజన్ అధ్యక్షుడు బొమ్మ సత్తిరెడ్డి, కార్యదర్శి ఎం.నర్సయ్య, డిప్లొమా ఇంజినీర్స్ అసోసియేషన్ కార్యదర్శి ఎ.రమేశ్, విద్యుత్ డిప్లొమా అసోసియేషన్ అధ్యక్షుడు అన్నం రమేశ్, ఏఈ అసోసియేషన్ అధ్యక్షుడు రవికుమార్, ఎమ్మార్టీ ఏఈ శ్రీనివాస్, యునెటైడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ వెంకటేశ్‌లతో పాటు 28 సంఘాల నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement