నిందితుడి ఇంటి ఎదుటే ఖననం 

Concern of the relatives and dalit associations in front of Macharla Ramesh house - Sakshi

గూడూరులో మృతురాలు బంధువులు, దళిత సంఘాల ఆందోళన

పాలకుర్తి: ఘట్‌కేసర్‌లో అత్యంత పాశవికంగా భార్య, శిశువును హత్య చేసిన నిందితుడు మాచర్ల రమేష్‌ను కఠినంగా శిక్షించాలని కోరుతూ జనగామ జిల్లా పాలకుర్తి మండలంలోని గూడూరులో మృతురాలి బంధువులు, దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం ఆందోళన చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట గొయ్యి తీసి ఘట్‌కేసర్‌లోని ఘటనా స్థలం నుంచి తీసుకొచ్చిన చితాభస్మాన్ని ఖననం చేశారు.

దహన సంస్కారాలు నిర్వహించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాధితులకు మద్దతుగా దళిత సంఘాలు, సుమారు 500 మంది రాస్తారోకో చేపట్టారు. నిందితుడి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. కుల వివక్షతోనే కర్కశంగా కాల్చి చంపారని, నిందితుడికి ఉరిశిక్ష వేయాలని డిమాండ్‌ చేశారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top