‘పాలమూరు’ ప్రాజెక్టులకు జూలై డెడ్‌లైన్‌ | Complete Palamuru Project before deadline: Harish Rao | Sakshi
Sakshi News home page

‘పాలమూరు’ ప్రాజెక్టులకు జూలై డెడ్‌లైన్‌

Feb 24 2017 3:26 AM | Updated on Mar 22 2019 2:59 PM

‘పాలమూరు’ ప్రాజెక్టులకు జూలై డెడ్‌లైన్‌ - Sakshi

‘పాలమూరు’ ప్రాజెక్టులకు జూలై డెడ్‌లైన్‌

పూర్వ మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మంత్రి హరీశ్‌రావు గురువారం డెడ్‌ లైన్‌ విధించారు.

సాక్షి, హైదరాబాద్‌: పూర్వ మహబూబ్‌ నగర్‌ జిల్లాలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు మంత్రి హరీశ్‌రావు గురువారం డెడ్‌ లైన్‌ విధించారు. జూన్‌ చివరి నాటికి యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి జూలైలో 8.5 లక్షల ఎకరాలకు సాగునీరందించాలని  అధికార యంత్రాంగాన్ని మంత్రి  ఆదేశిం చారు. జిల్లాలో పనులు కొనసాగుతున్న నాలుగు సాగునీటి పథకాలపై మంత్రులు హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావులు గురు వారం ఇక్కడి జలసౌధలో సమీక్ష జరిపారు. కల్వకుర్తి నుంచి 4 లక్షలు, భీమా నుంచి 2లక్షలు, నెట్టెంపాడు నుంచి 2 లక్షలు, కోయిల్‌ సాగర్‌ నుంచి 50 వేల ఎకరాలకు ఖరీఫ్‌లో  సాగునీరందించాల్సిందేనని చెప్పా రు. ఈ  ప్రాజెక్టులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు.

 నేటి నుంచి 15 రోజులకోసారి పనుల పురోగతిని సమీక్షిం చాలని, నిర్ణీత సమయంలో పనులు చేయని పక్షంలో ’60 సి’  నిబంధన కింద సంబంధిత ఏజెన్సీపై చర్యలు తీసుకోవాలని ఆదేశిం చారు. కల్వకుర్తి, నెట్టంపాడు, బీమా, కోయిల్‌ సాగర్‌ ఎత్తిపోతల పథకాల కోసం ప్రాధాన్యత  ప్రకారం, ప్రభుత్వం పెట్టిన గడువు  ప్రకారం పనులు పూర్తి  చేయాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాపై ప్రత్యేక దృష్టి పెట్టారని, జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి గుర్తుచేశారు. ప్రాజెక్టుల డిస్ట్రిబ్యూటరీ కెనాల్స్, ఫీల్డు చానల్స్‌ లను తనిఖీలు చేయాలని ఆయా కాలువల్లో ఉన్న గడ్డి, రాళ్ళు, రప్పలు, ఇతర అడ్డంకులు తొలగించాలని కోరారు.

భూ సేకరణ పనుల పురోగతిని ప్రతి వారం సమీ క్షించాలని ఇంజనీర్లు, ఎమ్మెల్యేలను మంత్రి కోరారు. ఈ పథకాల కోసం ఇంకా  భూ సేకరణ జరగాల్సి ఉందని, అది పూర్తయితే 8 లక్షల ఎకరాలకు సాగు నీరందుతుందని మంత్రి తెలిపారు. ప్రభుత్వ సాగునీటిరంగ సలహాదారు విద్యాసాగరరావు, స్పెషల్‌ సీఎస్‌ జోషి,  ఈఎన్‌సీ మురళీధర్‌ రావు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, రాజేందర్‌ రెడ్డి, సీహెచ్‌ రాంమోహనరెడ్డి, ఆళ్ల వెంకటేశ్వరరెడ్డి, మర్రి జనార్దనరెడ్డి,  సీఈలు ఖగేందర్‌ రావు, ఓఎస్డీ దేశ్‌ పాండే, వివిధ ఏజెన్సీల ప్రతినిధులు ఈ సమీక్షలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement