నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్‌  | Sakshi
Sakshi News home page

నేడు సిరిసిల్ల జిల్లాకు సీఎం కేసీఆర్‌ 

Published Mon, Dec 30 2019 2:18 AM

CM KCR Visits Rajanna Sircilla District Today - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమ వారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు ప్రగతి భవన్‌ నుంచి బయలుదేరి 10:30 గంటలకు వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వరి ఆలయానికి చేరుకుంటారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం మిడ్‌ మానేరు డ్యామ్‌ పరిశీలన కోసం బయలుదేరుతారు. మధ్యాహ్నం 12:30 గంటలకు మిడ్‌ మానేరు నుంచి బయలుదేరి ఒంటి గంటకు కరీంనగర్‌ జిల్లాలోని తీగలగుట్టపల్లికి చేరుకుంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడతారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 5 గంటలకు హైదరాబాద్‌ చేరుకోనున్నారు. 

Advertisement
 
Advertisement
 
Advertisement