మొరాయించిన సీఎం బస్సు | cm kcr bus in troble | Sakshi
Sakshi News home page

మొరాయించిన సీఎం బస్సు

Jul 5 2015 10:28 PM | Updated on Aug 14 2018 10:54 AM

మొరాయించిన సీఎం బస్సు - Sakshi

మొరాయించిన సీఎం బస్సు

సీఎం కేసీఆర్ బస్సు సాంకేతిక లోపంతో ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాసేపు మొండికేసింది.

పెద్దపల్లి (కరీంనగర్): సీఎం కేసీఆర్ బస్సు సాంకేతిక లోపంతో ఆదివారం కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాసేపు మొండికేసింది. ‘తెలంగాణ ప్రగతి రథం’ బస్సు స్థానిక ట్రినిటీకళాశాల మైదానానికి చేరుకోవడంతో అందరూ చూద్దామని వచ్చారు.

సాంకేతిక సమస్యంతో అది ముందుకు కదల్లేదు. రూ.5కోట్ల బస్సుకు అప్పుడే రిపేరు మొదలైందా అంటూ అక్కడున్న వారు ఆశ్చర్యపోయారు. సిబ్బంది అరగంటలో సమస్యను సరిచేసి బస్సును బయటికి తీసే ప్రయత్నంలో గోడకు తగిలింది. బహిరంగ సభ ముగిసిన అనంతరం సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఎమ్మెల్యేలు బస్సులో ధర్మారం వెళ్లారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement