చిన్నారితో చాకిరీ చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్ | Child labour rescued | Sakshi
Sakshi News home page

చిన్నారితో చాకిరీ చేయిస్తున్న వ్యక్తి అరెస్ట్

Jan 11 2016 7:35 PM | Updated on Sep 3 2017 3:29 PM

చిన్నారితో చాకిరీ చేయిస్తున్న ఓ యజమానిని రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు.

యాకుత్‌పురా (హైదరాబాద్) : చిన్నారితో చాకిరీ చేయిస్తున్న ఓ యజమానిని రెయిన్‌బజార్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ఎస్సై వి. సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... యాకుత్‌పురా సాదత్‌నగర్ ప్రాంతానికి చెందిన ఫిర్దోస్ (29) గత కొన్ని రోజులుగా జాఫర్ రోడ్డులో బైక్ మెకానిక్ దుకాణం నిర్వహిస్తున్నాడు.

అయితే జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన మహ్మద్ ఫరీద్ అన్సారీ (13) అనే బాలుడిని దుకాణంలో చేర్చుకుని పని చేయిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న హైదరాబాద్ చైల్డ్ ప్రొటెక్షన్ సెల్ అధికారులు రెయిన్‌బజార్ పోలీసుల సహకారంతో బాలుడికి విముక్తి కల్పించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫిర్దోస్‌ను అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement