నేడు చంద్రబాబు పాలమూరు పర్యటన | Chandrababu today Palamuru tour | Sakshi
Sakshi News home page

నేడు చ ంద్రబాబు పాలమూరు పర్యటన

Apr 23 2015 1:06 AM | Updated on Mar 22 2019 2:59 PM

నేడు చంద్రబాబు పాలమూరు పర్యటన - Sakshi

నేడు చంద్రబాబు పాలమూరు పర్యటన

తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను ఆ పార్టీ నాయకులు

హైదరాబాద్: తెలంగాణ తెలుగుదేశం పార్టీ గురువారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న కార్యక్రమ వివరాలను ఆ పార్టీ నాయకులు బుధవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఉదయం 10 గంటలకు ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు బయలుదేరుతారు.

తిమ్మాపూర్, షాద్‌నగర్, జడ్చర్ల మీదుగా మధ్యాహ్నం 12.30 గంటల వరకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన సభలో ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలనుద్దేశించి ప్రసంగిస్తారు. 3.30 గంటలకు సభను ముగిస్తారు. సాయంత్రం 4.30 నుంచి 7.30 గంటల వరకు నియోజకవర్గాల వారీగా పార్టీ సమీక్షలు నిర్వహిస్తారు.
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement