ఇరు ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు మోసం: హరీష్ | Chandrababu Naidu deceiveing people of two states, says Harish Rao | Sakshi
Sakshi News home page

ఇరు ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు మోసం: హరీష్

Oct 27 2014 6:19 PM | Updated on Sep 2 2017 3:28 PM

ఇరు ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు మోసం: హరీష్

ఇరు ప్రాంతాల ప్రజలకు చంద్రబాబు మోసం: హరీష్

ఇరు ప్రాంతాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు.

హైదరాబాద్: ఇరు ప్రాంతాల ప్రజలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని తెలంగాణ మంత్రి హరీష్ రావు విమర్శించారు. గతంలో తాను ఇచ్చిన జీవోలనే ఇప్పడు చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారని ఆయన అన్నారు. ప్రభుత్వ మీడియా సలహాదారుడు పరకాల ప్రభాకర్, మంత్రి దేవినేని ఉమలు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హరీష్ సూచించారు.
 
తెలంగాణలో విద్యుత్ సమస్య వల్లే శ్రీశైలంలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నామని ఆయన మీడియాతో అన్నారు. కృష్ణా జలాల కేటాయింపులో తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని బోర్డు చైర్మన్ దృష్టికి తీసుకెళ్లామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా జరుగుతున్న దోపిడిని బోర్డు చైర్మన్ కు వివరించామన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement