
హోటళ్లలో నిల్వ ఆహార పదార్థాలు
కొత్తగూడెంఅర్బన్: కొత్తగూడెం పట్టణంలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ అధికారులు బుధవారం తెల్లవారుజామున తనిఖీలు నిర్వహించారు. హోటళ్లు, రెస్టారెంట్లలో నిల్వ పదార్థాలు అమ్ముతున్నారనే సమాచారంతో తనిఖీలు చేపట్టినట్టు మున్సిపల్ కమిషనర్ బి.వంశీకృష్ణ తెలిపారు. పట్టణ పరిధిలోని లేపాక్షి రెస్టారెంట్, గ్రీన్‌చిల్లి రెస్టారెంట్‌లో తనిఖీలు చేశారు. లేపాక్షి హోటల్, గ్రీన్‌చిల్లి హోటల్స్‌లో నిల్వ ఉన్న చికెన్, బిర్యాని, వివిధ ఫ్రైలు, బిర్యాని, ఎగ్స్ గుర్తించారు.
నిల్వ ఉన్న ఆహార పదార్థాలను అమ్ముతున్న యజమానులపై మున్సిపల్ కమిషనర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడడం సరికాదన్నారు. ఇలా మరోసారి జరిగితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. రెండు హోటళ్ల వారికి రూ.20వేల చొప్పన జరిమాన విధించారు. తెల్లవారుజామున హోటళ్లలో తనిఖీలు చేయడంతో పట్టణంలోని ఇతర హోటళ్ల వారు ఆందోళనకు గురయ్యారు. తనిఖీలలో శానిటరీ ఇన్స్‌పెక్టర్ రవి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.