కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు

CH Malla Reddy Visits Chilkur Balaji Temple At Moinabad - Sakshi

కాళేశ్వరం విజయవంతం కావడంతో ప్రత్యేక పూజలు

చిలుకూరులో మల్లారెడ్డి 108 ప్రదక్షిణలు

సాక్షి, మొయినాబాద్‌: రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి చిలుకూరు బాలాజీ దేవాలయంలో మొక్కు చెల్లించుకున్నారు. వినాయక చవితి సందర్భంగా సోమవారం బాలాజీ దేవాలయానికి వచ్చిన ఆయన ఆలయ గర్భగుడి చుట్టూ 108 ప్రదక్షణలు చేశారు. సీఎం కేసీఆర్‌ మానస పుత్రిక కాళేశ్వరం ప్రాజెక్టు విజయవంతం కావడంతోపాటు చంద్రశేఖరరావు ఆధ్వర్యంలో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని ఆయన చిలుకూరులో 108 ప్రదక్షిణలు చేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఆయనతోపాటు 108 ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ గర్భగుడిలో స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని శివాలయంలో సుందరేశ్వరస్వామికి అభిషేకం నిర్వహించారు.

మంత్రి రాకతో ఆలయ ప్రాంగణంలో రాజకీయ నాయకుల సందడి నెలకొంది. కార్యక్రమంలో చిలుకూరు సర్పంచ్‌ గునుగుర్తి స్వరూర, ఎంపీపీ గునుగుర్తి నక్షత్రం, జీటీఆర్‌ మండల అధ్యక్షుడు దేవరంపల్లి మహేందర్‌రెడ్డి, మాజీ జెడ్పీటీసీ కొంపల్లి అనంతరెడ్డి, ఎంపీటీసీ రవీందర్, మాజీ ఎంపీటీసీ గుండు గోపాల్, మాజీ సర్పంచ్‌ పురాణం వీరభద్రస్వామి, మాజీ ఉపసర్పంచ్‌ ఆండ్రూ, టీఆర్‌ఎస్‌ మండల ఉపాధ్యక్షుడు జయవంత్, ఏఎంసీ వైస్‌ చైర్మన్‌  దారెడ్డి వెంకట్‌రెడ్డి, చిన్నమంగళారం సర్పంచ్‌ సుకన్య, నాయకులు హరిశంకర్‌ గౌడ్, విష్ణుగౌడ్, రవియాదవ్, రాఘవేందర్‌ యాదవ్, గడ్డం అంజిరెడ్డి, చెన్నయ్య ఉన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top