
సాక్షి, హైదరాబాద్ : ఆస్ట్రేలియా నుంచి ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చిన యువకుడిపై మాదాపూర్ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన యువకుడిని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్‌లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ యువకుడు బయట తిరిగాడు.
మాదాపుర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీల్లో కారులో సదరు యువకుడు కనిపించాడు. ప్రభుత్వం సూచనలను బేఖాతరు చేసినందుకు సైబరాబాద్ పోలీసులు అతని పై కేసు నమోదు చేసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు.