madhapur ps
-
ప్రభుత్వ సూచనలు బేఖాతరు.. కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్ : ఆస్ట్రేలియా నుంచి ఐదు రోజుల క్రితం నగరానికి వచ్చిన యువకుడిపై మాదాపూర్ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. రాష్ట్రంలో కరోనా ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ఆస్ట్రేలియా నుంచి వచ్చిన యువకుడిని ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లో ఉండాలని అధికారులు సూచించారు. అయితే అధికారుల సూచనలను బేఖాతరు చేస్తూ యువకుడు బయట తిరిగాడు. మాదాపుర్ హైటెక్ సిటీ చౌరస్తా వద్ద పోలీసులు తనిఖీల్లో కారులో సదరు యువకుడు కనిపించాడు. ప్రభుత్వం సూచనలను బేఖాతరు చేసినందుకు సైబరాబాద్ పోలీసులు అతని పై కేసు నమోదు చేసి, గాంధీ ఆసుపత్రికి తరలించారు. -
దాడి కేసులో విష్ణుకు నోటీసులు
హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రెడ్డికి బుధవారం పోలీసులు నోటీసులు జారీ చేశారు. 37మంది ప్రత్యక్షసాక్షుల వాంగ్మూలాన్ని మాదాపూర్ పోలీసులు నమోదు చేశారు. సీసీ టీవీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు... విష్ణు సహా కొంతమంది దాడి చేసినట్లు గుర్తించారు. దాంతో విష్ణుకు నోటీసులు ఇచ్చారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. -
విష్ణుపై చర్యలకు సిద్ధమవుతున్న పోలీసులు
హైదరాబాద్ : కల్వకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే వంశీచంద్ రెడ్డిపై దాడి చేసిన కేసులో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డిపై చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు. విష్ణుకు నోటీసులు జారీచేయనున్న పోలీసులు ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 37 మంది సాక్ష్యులను ప్రశ్నించారు. కాగా ఈనెల 12వ తేదీన ఓ వివాహ వేడుకలో పరస్పరం దాడికి పాల్పడిన కాంగ్రెస్ యువనేతల వివాదం కొనసాగుతున్న విషయం తెలిసిందే. తెలంగాణ కాంగ్రెస్ పెద్దలు సర్దిచెప్పేందుకు ప్రయత్నించినా... ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఇద్దరూ రాజీకి వచ్చేందుకు నిరాకరించారు. ఇది పూర్తిగా తమ వ్యక్తిగత వ్యవహారం అన్నట్లుగా ఇద్దరూ పట్టుపడుతున్నట్లు సమాచారం. విష్ణు, వంశీచంద్ రెడ్డి పరస్పర ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగవంతం చేశారు. -
విష్ణుపై చర్యలకు పోలీసులు సిద్ధం
-
వంశీ నా చెవిలో దూషించాడు...
హైదరాబాద్ : కాంగ్రెస్ యువ నేతలు వంశీచంద్‌రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డిల మధ్య వివాదం మరింత ముదురుతోంది. వీరిద్దరి మధ్య జరిగిన పంచాయితీ ...పార్టీ అధిష్టానం వద్దకు వెళ్లింది. నిన్న మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో వంశీచంద్-విష్ణు నిన్న షుర్షణ పడిన విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరూ హైకమాండ్‌కు పరస్పరం ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై విష్ణు మాట్లాడుతూ వంశీచంద్ తన దగ్గరకు వచ్చి చెవిలో దూషించాడని అన్నారు. మరోవైపు ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలంటూ కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతరావు ఈరోజు మధ్యాహ్నం వంశీచంద్ రెడ్డి నివాసానికి వెళ్లారు. గొడవలు పడవద్దంటూ హితవు పలికారు. అనంతరం వంశీచంద్ రెడ్డి మాట్లాడుతూ తాను విష్ణును దూషించలేదని...దాడి చేసిందే కాకుండా...మళ్లీ తనపై ఆరోపణలు చేయటం సరికాదన్నారు. ఎవరు ఎవరిపై దాడి చేసింది సీసీ కెమెరా పుటేజ్‌లో తెలుస్తుందన్నారు. -
కాంగ్రెస్ యువ నేతల పోట్లాట
పరస్పరం దాడి చేసుకున్న ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ కేంద్రంలో ఘటన హైదరాబాద్: ఒకరు ఎమ్మెల్యే, మరొకరు మాజీ ఎమ్మెల్యే.. ఆ ఇద్దరు ఒకే పార్టీకి చెందిన యువ నేతలు.. ఓ పెళ్లిలో ఎదురుపడి చేయి చేయి కలిపారు.. అంతలోనే ఏదో గలాటా మొదలైంది.. వాదులాటలు.. తోపులాటలు జరిగాయి.. ఆ తర్వాత సీన్ పోలీస్‌స్టేషన్‌కు మారింది. నాపై దాడి జరిగిందంటే.. నాపై దాడి జరిగిందంటూ ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకునేదాకా వెళ్లింది.. ఇదంతా కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి, ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మధ్య జరిగిన వ్యవహారం. మాదాపూర్ ఏసీపీ రమణకుమార్, బాధితులు తెలిపిన ప్రకారం... మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి బావమరిది లలిత్ శశాంక్‌రెడ్డి వివాహం శుక్రవారం హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో ఎన్ కన్వెన్షన్ సెంటర్లో జరిగింది. మధ్యాహ్నం పెళ్లి వేడుకకు హాజరైన కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి మండపం దగ్గరికి వెళ్లారు. అప్పటికే అక్కడ ఉన్న విష్ణువర్ధన్‌రెడ్డి, వంశీచంద్‌రెడ్డి ఒకరినొకరు పలకరించుకున్నారు. కానీ అంతలోనే అక్కడ తోపులాట, గొడవ జరిగింది. వెంటనే వంశీచంద్‌రెడ్డి మరికొందరు పార్టీ నేతలతో కలసి మాదాపూర్ పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి.. విష్ణువర్ధన్‌రెడ్డి అకారణంగా తనపై దాడి చేశాడని ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో విష్ణువర్ధన్‌రెడ్డి తల్లి ఇందిర, సోదరి విజయారెడ్డి, తమ అనుచరులతో కలసి అదే పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. తమ పెళ్లికి వచ్చిన వంశీచంద్‌రెడ్డి షేక్‌హ్యాండ్ ఇవ్వడంతోనే దాడి చేసి తన మెడపై, వీపుపై కొట్టాడని ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులు స్వీకరించిన పోలీసులు ఎన్ కన్వెన్షన్ సెంటర్లోని సీసీ కెమెరాల ఫుటేజీలను స్వాధీనం చేసుకున్నారు. వంశీచంద్ గన్‌మన్ మజీర్ స్టేట్మెంట్ను నమోదు చేసుకున్నారు. వారి ఫిర్యాదుల మేరకు విష్ణువర్ధన్‌రెడ్డిపై 324, 506, 342 సెక్షన్ల కింద... వంశీచంద్‌రెడ్డిపై 341, 323, 290, 506 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశామని మాదాపూర్ ఏసీపీ రమణకుమార్ తెలిపారు. కాగా.. టీ సీఎల్పీ నేత జానారెడ్డి వంశీ, విష్ణు మధ్య రాజీ కుదిర్చే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర యువజన కాంగ్రెస్ సభ్యత్వ నమోదు అంశమే.. ఈ వివాదానికి కారణమై ఉంటుందని యూత్‌కాంగ్రెస్ వర్గాలు భావిస్తున్నాయి. అకారణంగా దాడి చేశారు: వంశీచంద్‌రెడ్డి ‘‘వంశీ అని పలుకరించడంతో విష్ణువర్ధన్‌రెడ్డికి షేక్‌హ్యాండ్ ఇచ్చాను. కానీ ఆయన వేళ్లు విరగ్గొట్టేందుకు ప్రయత్నించాడు. చెయ్యి లాక్కుం టుండగా ముఖంపై దాడి చేశాడు. నా గన్‌మన్ రక్షణగా వస్తే అతనిపైనా దాడి చేశాడు. విష్ణు వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రజలందరికీ తెలుసు. ఎలాంటి వ్యక్తిగత విభేదాలు లేవు. అయినా దాడి ఎందుకు చేశారో ఆయన్నే అడగాలి.’’ ఉద్దేశపూర్వకంగా కొట్టాడు: విష్ణువర్ధన్‌రెడ్డి ‘‘షేక్‌హ్యండ్ ఇవ్వడంతోనే వంశీచంద్‌రెడ్డి నా మెడ, వీపుపై ఉద్దేశపూర్వకంగా కొట్టాడు. అతని వెంట ఉన్న గన్‌మన్ నా వైపు తుపాకీ చూపి బెదిరించాడు. వంశీతో నాకు ఎలాంటి వివాదాలు లేవు. నాపై దాడి ఎందుకు చేశాడో అతనే స్పష్టం చేయాలి. వంశీపై టీ పీసీసీ అధ్యక్షుడికి ఫిర్యాదు చేశాను.’’ -
సీసీటీవీ చూడండి.. తప్పెవరిదో తెలుస్తుంది!
-
వాళ్ళిద్దరి కేసులను నమోదు చేసుకున్నాం
-
పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ
-
పెళ్లిలో విష్ణు-వంశీచంద్ రెడ్డి మధ్య ఘర్షణ
హైదరాబాద్ : ఓ పెళ్లి వేడుక ... తెలంగాణ కాంగ్రెస్ నేతల మధ్య ఘర్షణకు వేదిక అయ్యింది. కాంగ్రెస్ మాజీ, తాజా ఎమ్మెల్యేలు శుక్రవారం బాహాబాహీకి దిగారు. మాదాపూర్ ఎన్ కన్వెన్షన్ హాల్లో జూబ్లీహిల్స్ మాజీ ఎమ్మెల్యే విష్ణువర్థన్ రెడ్డి బావమరిది పెళ్లిలో ..విష్ణువర్థన్ రెడ్డి, కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డిల మధ్య వివాదం కాస్త ముదిరి చివరకు కొట్టుకునే వరకూ వెళ్లింది. వివరాల్లోకి వెళితే విష్ణు బావమరిది పెళ్లికి వంశీచంద్ రెడ్డి శుక్రవారం హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విష్ణువర్ధన్ రెడ్డిని ...వంశీచంద్ రెడ్డి గన్ మెన్ పక్కకు తప్పుకోవాలని సూచించాడు. ఆగ్రహించిన విష్ణు... గన్ మెన్ పై చేయి చేసుకున్నారు. దాంతో వంశీచంద్ రెడ్డి.. విష్ణుతో వాగ్వివాదానికి దిగారు. అది కాస్తా ఘర్షణకు దారి తీసింది. ఈ సంఘటనలో వంశీచంద్‌రెడ్డి గాయపడగా, అతడిని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఈ ఘటనపై విష్ణువర్థన్ రెడ్డి, వంశీచందర్ రెడ్డి మాదాపూర్ పోలీస్ స్టేషన్లో పరస్పరం ఫిర్యాదు చేసుకున్నారు. వంశీ ఎందుకు చెయ్యి చేసుకున్నారా అని తాను ఇప్పటికీ షాక్ లోనే ఉన్నట్లు విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. తానెప్పుడూ యూత్ కాంగ్రెస్ వ్యవహారాల్లో కూడా జోక్యం చేసుకోలేదని, అలాంటిది తానంటే ఆయనకు ఎందుకు అంత కోపమో తెలియలేదని చెప్పారు. మరోవైపు.. అసలే భర్త చనిపోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న తనను ఇప్పుడు ఈ వివాదం మరింత ఆందోళన కలిగిస్తోందని విష్ణు తల్లి శోభ వాపోయారు. తన బిడ్డను చంపాలని కొంతమంది చూస్తున్నట్లు ఆమె ఆరోపించారు.