అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’  | Sakshi
Sakshi News home page

అక్రమ రవాణాను అడ్డుకున్న ‘ప్రమాదం’ 

Published Sat, Sep 14 2019 11:48 AM

Cannabis Move in the Name of Coconut Bonds - Sakshi

కారేపల్లి: చేసేది గంజాయి రవాణా.. పైకి కనిపించేది కొబ్బరిబొండాల తరలింపు.. అక్రమార్కుల దొంగ తెలివితేటలు ఎంతలా ఉన్నాయంటే వింటే ఆశ్యర్యం కలగక మానదు. ఎంత దొంగ తెలివి ప్రదర్శించినా విధి వారి గుట్టును రట్టు చేసింది. పోలీసులు తెలిపిన వివరాలు.. కారేపల్లి మండలం గాంధీపురం రైల్వేస్టేషన్‌కు సమీపంలో కొబ్బరిబొండాల రవాణా ముసుగులో గంజాయి తరలిస్తున్న బోలెరో వాహనం అదుపుతప్పి చెట్టును ఢీ కొట్టింది. దీంతో అందు లోని గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. ఒడిశా రాష్ట్రం సరిహద్దు ప్రాంతాల నుంచి (ఏపీ 28వై 4823) బొలెరో ట్రాలీలో ఇల్లందు మీదు గా ఖమ్మం, అక్కడి నుంచి హైదరాబాద్‌ ప్రాంతాలకు గంజాయి తరలిస్తుం డగా శుక్రవారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. డ్రైవర్‌ నిద్రమత్తులోనో, లేదా మద్యం మత్తులో నో రోడ్డు ప్రక్కనే ఉన్న చెట్టును ఢీకొట్టి ఉంటా డని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతను వాహనాన్ని, గంజాయి ప్యాకెట్లను వదిలేసి అక్కడి నుంచి ఉడాయించాడు. తెల్లవారు జామున కొంత మంది వ్యక్తులు పోలీసులకు సమాచారం అందించటంతో ఘటన స్థాలానికి సీఐ శ్రీనివాసులు, ఎస్‌ఐ పొదిల వెంకన్న, తహశీల్దార్‌ సీహెచ్‌ స్వామి చేరుకుని పంచనామా నిర్వహించారు. 

137 గంజాయి పాకెట్లు–2.46 క్వింటాళ్లు.. 
అనంతరం సీఐ శ్రీనివాసులు విలేకరులతో మాట్లాడుతూ.. కర్ణాటక(ఆర్‌సీ ప్రకారం) కు చెందిన బొలెరో వాహనం ఒడిశా రాష్ట్రం నుంచి హైదారాబాద్‌ వైపు ఈ గంజాయిని రవాణా చేస్తున్నట్లు తెలుస్తుందని, 137 గంజాయి ప్యాకెట్లను గుర్తించామని, ఒక్కో ప్యాకెట్‌ 1.8 కిలోల బరువు ఉన్నట్లు తెలిపారు. వీటి విలువ సుమారు రూ.7.38 లక్షలు ఉంటుందని పేర్కొన్నారు. 

మండలంలో రెండోసారి.. 
కారేపల్లి మండలంలో సింగరేణి ఓసీ–2 వద్ద ఖమ్మం–ఇల్లందు ప్రధాన రహదారిపై 2017 డిసెంబర్‌ 4వ అర్ధరాత్రి కారేపల్లి పోలీసులు, టాస్క్‌ఫోర్సు సంయుక్తంగా గంజాయితో వెళ్లుతున్న డీసీఎం వాహనాన్ని పట్టుకున్నారు. అందులో సుమారు 5 క్వింటాళ్ల గంజాయి ప్యాకెట్లు స్వాధీనం చేసుకున్నారు.   

Advertisement
Advertisement