హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు.
హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో పట్టపగలు ఓ యువకుడిని గుర్తుతెలియని దుండగులు కత్తులతో దాడి చేసి హతమార్చారు. ఈ సంఘటన సికింద్రాబాద్ లోని స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. స్వప్నలోక్ కాంప్లెక్స్ వద్ద నిల్చుని ఉన్న ఓ వ్యక్తి వద్దకు ఆటోలో వచ్చిన ఇద్దరు యువకులు కాసేపు మాట్లాడారు.
అనంతరం తమతోపాటు తెచ్చిన కత్తితో యువకుడి గొంతు కోసి హత్యచేశారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతుని వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని, పాత కక్షల నేపథ్యంలోనే ఈ ఘటన జరిగి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు.