రెండు రోజుల్లో పెళ్లి.. వరుడి ఆత్మహత్య | bridegroom commits suicide two days before marriage | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో పెళ్లి.. వరుడి ఆత్మహత్య

Published Wed, Feb 25 2015 8:25 PM | Last Updated on Sat, Sep 2 2017 9:54 PM

bridegroom commits suicide two days before marriage

వరంగల్ (నెల్లికుదురు): రెండు రోజుల్లో అతని పెళ్లి.. అయితే, దొంగబంగారం కేసులో అకారణంగా తన పేరు చెప్పారని మనో వేదనకు గురైన వరుడు క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం చిన్నముప్పారంలో మంగళవారం రాత్రి జరిగింది. వివరాలు.. చిన్నముప్పారం గ్రామానికి చెందిన పిట్టల వీరన్న(23) వివాహం ఈ నెల 27న చేసేందుకు పెద్దలు అన్ని ఏర్పాట్లు చేశారు.

ఈ క్రమంలో బంగారు ఆభరణాల చోరీ కేసులో నెల్లికుదురు మండలం శ్రీరామగిరికి చెందిన ఓ మహిళను ఖమ్మం సీసీఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో ఆమె పిట్టల వీరన్నకు చెవి కమ్మలు, పట్టీలు ఇచ్చినట్లు చెప్పింది. దీంతో పోలీసులు ఈ నెల 22 గ్రామానికి వచ్చి వీరన్నను అదుపులోకి తీసుకోగా, గ్రామస్తులు విజ్ఞప్తి మేరకు వదిలిపెట్టారు. ఈ నెల 23న వీరన్నను సర్పంచ్‌తో సహా గ్రామపెద్దలు ఖమ్మం పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి.. తీసుకొచ్చారు. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రి వీరన్న సూసైడ్ నోట్ రాసి పెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement