తలరాతలు మార్చిన బోగస్ ఓట్లు! | Bogus votes changes politicans entire life | Sakshi
Sakshi News home page

తలరాతలు మార్చిన బోగస్ ఓట్లు!

May 21 2014 3:33 AM | Updated on Sep 2 2017 7:37 AM

ఇటు హైదరాబాద్ శివార్లలో, అటు సీమాంధ్రలో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు వేయడం టీడీపీకి కలిసి వచ్చిందని కూకట్‌పల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు చెప్పారు.

రెండు చోట్ల ఓటుపై కోర్టుకు: పద్మారావు
 టీడీపీ గెలుపునకు కారణం అదే!

 హైదరాబాద్, సాక్షి: ఇటు హైదరాబాద్ శివార్లలో,  అటు సీమాంధ్రలో ఓటు హక్కు కలిగినవారు రెండు చోట్లా ఓటు వేయడం టీడీపీకి కలిసి వచ్చిందని కూకట్‌పల్లి నియోజకవర్గ టీఆర్‌ఎస్ అభ్యర్థి గొట్టిముక్కల పద్మారావు చెప్పారు. నగర శివార్లలో టీడీపీ తొమ్మిది చోట్ల విజయం సాధించడానికి ఈ విధమైన బోగస్ ఓట్లే కారణమని మంగళవారం ఆయన మీడియూతో అన్నారు. ‘‘ఒక వ్యక్తి రెండు చోట్ల ఓటు వేసి అభ్యర్థుల గెలుపోటములు శాసించడం రాజ్యాంగ విరుద్ధం. ఓటరుకు ఒక్కచోటే ఓటుహక్కు ఉండాలి. రెండుచోట్ల ఓటువేసే అవకాశం కల్పించడం ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ తప్పిదం.
 
 తెలంగాణలో ఉన్న ఆంధ్రా ప్రాంతం వారికి ఆప్షన్ ఇచ్చి వె ంటనే బోగస్ ఓట్లను తొలగించాల్సిన అవసరం ఉంది. రెండుచోట్ల ఓటు వేసిన అంశంపై కోర్టును ఆశ్రయిస్తా. కేంద్ర , రాష్ట్ర ఎన్నికల సంఘాలకు కూడా ఫిర్యాదు చేస్తా. పార్లమెంట్‌లో తెలంగాణ బిల్లు ఆమోదం పొందిన వెంటనే భారీ సంఖ్యలో సెటిలర్లు ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పక్కాప్లాన్‌తో హైదరాబాద్‌లో సీమాంధ్రవారి ఓట్లు అధిక సంఖ్యలో ఉండేలా ప్లాన్ చేశారు. వారితో రెండు చోట్ల ఓటు వేయించి లబ్ధి పొందారు..’’ అని పద్మారావు చెప్పారు.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement