నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు.
మిర్యాలగూడ: నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గానికి చెందిన ఇరవై మంది బీజేపీ నేతలు పార్టీ పదవులకు రాజీనామా చేశారు. నియోజకవర్గ ఇన్‌చార్జి పాదూరి కరుణ, జిల్లా అధ్యక్షుడు వీరెల్లి చంద్రశేఖర్ వైఖరికి నిరసనగా వైదొలుగుతున్నట్ల్లు వారు బుధవారం ప్రకటించారు. రాజీనామా చేసిన వారిలో మూడు మండలాల అధ్యక్ష, కార్యదర్శులతో పాటు ఏడు గ్రామాల అధ్యక్ష, కార్యదర్శులు ఉన్నారు.