జల్సాలకు అలవాటుపడి.. ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు.
ఉప్పల్ (హైదరాబాద్) : జల్సాలకు అలవాటుపడి.. ఈజీ మనీ కోసం బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న ముగ్గురు వ్యక్తులను శుక్రవారం ఉప్పల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ. 5.15 లక్షల విలువైన 15 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వివరాల ప్రకారం.. నగరంలోని రామాంతపురానికి చెందిన అశోక్(32), శ్రీకాంత్(19), రాములు(35) కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
ఈ క్రమంలో తాగుడుకు బానిసలు కావడంతోపాటు కష్టపడకుండా డబ్బు సంపాదించడానికి చోరీలకు పాల్పడటం ప్రారంభించారు. అప్పటి నుంచి నగరంలోని పలు పోలీస్ స్టేషన్‌ల పరిధిలో 15 బైకులను అపహరించారు. శుక్రవారం పోలీసులు సాధారణ తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించడంతో.. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా చోరీల విషయం బయటపడింది.