‘మిషన్’లో భాగస్వాములు కండి | Become Partners in mission kakatiya | Sakshi
Sakshi News home page

‘మిషన్’లో భాగస్వాములు కండి

Apr 20 2015 2:04 AM | Updated on Sep 17 2018 8:04 PM

‘మిషన్’లో భాగస్వాములు కండి - Sakshi

‘మిషన్’లో భాగస్వాములు కండి

మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో...

జేఏసీ చైర్మన్ కోదండరాం పిలుపు
మేడ్చల్ రూరల్: మిషన్ కాకతీయలో భాగంగా చేపడుతున్న చెరువుల పునరుద్ధరణ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం పిలుపునిచ్చారు. జేఏసీ ఆధ్వర్యంలో ఆదివారం రంగారెడ్డి జిల్లా మేడ్చల్ మండలం గిర్మాపూర్ దాతర చెరువులో శ్రమదానం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ, న్యాయవాద, పారిశ్రామిక జేఏసీ నాయకులు ఇందులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోదండరాం మాట్లాడుతూ.. చెరువు బాగుం టేనే ఊరు బాగుంటుందన్నారు.

మిషన్ కాకతీయ పనుల్లో తమవంతు సహకారం అందించేందుకు జేఏసీ శ్రమదానం కార్యక్రమాన్ని చేపట్టిందని తెలిపారు. కార్యక్రమంలో మేడ్చల్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, జేఏసీ కో చైర్మన్ మల్లేపల్లి లక్ష్మయ్య, టీఎన్‌జీవో అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి, తెలంగాణ గెజిటెడ్ అధికారుల సంఘం రాష్ట్ర నాయకుడు మధుసూదన్, న్యాయవాదుల జేఏసీ చైర్మన్ రాజేందర్‌రెడ్డి, పారిశ్రామికవేత్తల సంఘం రాష్ట్ర చైర్మన్ సుధీర్‌రెడ్డి, ఇంటర్ విద్య జేఏసీ చైర్మన్ మధుసూదన్ రెడ్డి, గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లక్ష్మారెడ్డి, ఇరిగేషన్ శాఖ ఓఎస్‌డీ శ్రీధర్ దేశ్‌పాండే తదితరులు ప్రసంగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement