
నిత్యావసరాలు పంపిణీ చేస్తున్న ఎస్‌ఐ స్రవంతి
ఖమ్మం: కామేపల్లి మండలంలోని గోవింద్రాల బంజర గ్రామం మస్జీద్ సెంటర్‌లో ‘హెల్పింగ్ హ్యాండ్స్ ఆఫ్ బంజర యూత్’ ఆధ్వర్యంలో ఆదివారం నిరుపేదలకు నిత్యావసర సరుకులు, కూరగాయాలు కామేపల్లి ఎస్‌ఐ స్రవంతి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. లాక్‌డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేదలకు యూత్ సభ్యులు నెల రోజుల నుంచి కూరగాయలు అందించడం అభినందనీయమన్నారు.
ఈ కార్యక్రమంలో యూత్ సభ్యులు షేక్ ఇషాఖ్, పింగళి పృథ్వీరిషీ, ఎల్.సంతోష్, గంగారపు ప్రశాంత్, షేక్ ఇమ్రాన్, సయ్యద్ రహిమతుల్లా, సయ్యద్ సలీం, సయ్యద్ హుస్సేన్ షా, బంక ప్రేమ్, గోపి ప్రశాంత్, సయ్యద్ నజీర్ పాషా, బీ శ్రీను, బానోత్ రవి, సయ్యద్ అన్వర్, సయ్యద్ ముస్తఫా, షేక్ ఆజాద్, షేక్ హుస్సేన్, సయ్యద్ అమీర్, పవన్‌కల్యాణ్, విక్రమ్, ఎస్.ఎన్.పాషా పాల్గొన్నారు.