బల్దియాల్లో బాదుడు | Baldiyallo stroke | Sakshi
Sakshi News home page

బల్దియాల్లో బాదుడు

Jan 10 2015 2:33 AM | Updated on Sep 2 2017 7:27 PM

జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో ఆస్తిపన్ను పెంపునకు కార్యచరణ సిద్ధమవుతోంది.

శాతవాహన యూనివర్సిటీ : జిల్లాలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగరపంచాయతీల్లో ఆస్తిపన్ను పెంపునకు కార్యచరణ సిద్ధమవుతోంది. దాదాపు పుష్కర కాలం తర్వాత.. ఈ అక్టోబర్ నుంచే ఆస్తిపన్ను  పెంచడానికి అనుమతివ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపిన విషయం విదితమే. వీటికి పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శైలేంద్ర కుమార్‌జోషి ఇప్పటికే ఆమోద్రముద్ర వేశారని, ముఖ్యమంత్రి ఆమోదం తెలిపితే ఆస్తిపన్ను పెంపుఖాయమని అధికారులు చెబుతున్నారు.

దీంతో జిల్లాలోని రెండు కార్పొషన్లు, నాలుగు మున్సిపాలిటీలు, ఐదు నగరపంచాయతీల్లో ఆస్తిపన్ను భారీగా పెరగనుంది. సర్కారు నుంచి ఉత్తర్వులు అందగానే కార్యాచరణ ప్రణాళిక సిద్ధమవుతుందని అధికారులు చెబుతున్నారు. మున్సిపల్ చట్టాల ప్రకారం ప్రతీఐదేళ ్లకోసారి ఆస్తిపన్ను సవరించాల్సిఉంది. చివరిసారిగా నివాసాపై 12 ఏళ్ల క్రితం, నివాసేతర భవనాలపై ఏడేళ్ల క్రిత ం (2007)లో ఆస్తిపన్ను పెంచినట్లు అధికారులు వివరిస్తున్నారు. అవసరాలు, ఇతరత్రా వ్యయాలు భారీగా పెరిగినందున నగర, పురపాలక సంస్థలు ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఇలాంటి క్రమంలో ఆస్తిపన్ను పెంపుతో ఆర్థికంగా సంస్థలను బలోపేతం చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.
 
ఎన్నికలతో ఆగిన ప్రతిపాదన..!

ఆస్తిపన్ను పెంపునకు గతంలోనే ఉత్తర్వులు వెలువరించేందుకు యత్నించగా, ఎన్నికలు, తదితర అనివార్య కారణాలతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. 2007లో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే ఇప్పటి వరకు కమర్షియల్ భవనాలకు రివైజ్డ్ రేట్ల ప్రకారం ఆస్తిపన్ను విధించినట్లు సమచారం.
 
భారీగా వడ్డన..?
ఈసారి బల్దియాలోని ప్రజలపై ఆస్తిపన్ను భారీగానే పడనున్నట్లు తెలుస్తోంది. కొత్తగా ఏర్పడిన నగర పంచాయతీలకు ఏప్రిల్, పాత మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ప్రస్తుత పన్నులపై 40-50 శాతం ఆస్తిపన్ను పెరిగే అవకాశం ఉంది.
 
40శాతం ఆస్తి పన్ను పెంపుతో బల్దియాలపై పడే అదనపు భారం వివరాలు ఇవీ..
 సంస్థ                                             {పస్తుత         అదనపు భారం
                                                   ఆస్తి పన్ను     (రూ.లలో)
 కరీంనగర్ కార్పొరేషన్                11.50 లక్షలు    4.60 లక్షలు
 రామగుండం కార్పొరేషన్                12 కోట్లు        4.80 కోట్లు
 జగిత్యాల మున్సిపాలిటీ                  5 కోట్లు           2 కోట్లు
 కోరుట్ల  మున్సిపాలిటీ                2.4 కోట్లు        81.60 లక్షలు
 మెట్‌పల్లి మున్సిపాలిటీటి                1.10 కోట్లు    44 లక్షలు
 సిరిసిల్ల  మున్సిపాలిటీ                2.50 లక్షలు      1 కోటి
 పెద్దపల్లి నగరపంచాయతీ                2 కోట్లు        80 లక్షలు
 వేములవాడ  నగరపంచాయతీ            72 లక్షలు        28.80 లక్షలు
 హుజూరాబాద్ నగరపంచాయతీ            60 లక్షలు        24 లక్షలు
 హుస్నాబాద్ నగరపంచాయతీ            1.40 కోట్లుల    59.20 లక్షలు
 జమ్మికుంట నగరపంచాయతీ            70 లక్షలు        28 లక్షలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement