ఒంటరి మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం | auto driver rapes widow women in khammam | Sakshi
Sakshi News home page

ఒంటరి మహిళపై ఆటోడ్రైవర్ అత్యాచారం

May 22 2015 5:49 PM | Updated on Mar 9 2019 4:29 PM

ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వితంతువుపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు.

ఖమ్మం: ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి వితంతువుపై అత్యాచారానికి ఒడిగట్టాడు ఓ ప్రబుద్ధుడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా చింతకాని మండలం నేరెడ గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వితంతువుపై కన్నేసిన ఆటోడ్రైవర్ గోగుల రాంబాబు(45) గురువారం అర్ధరాత్రి దాటాక ఆమె ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడు.

ఈ దాడిలో మహిళ తీవ్రంగా గాయపడింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement