తెలంగాణలో అధికారం వైఎస్సార్ సీపీదే | authority of ysrcp in telangana also | Sakshi
Sakshi News home page

తెలంగాణలో అధికారం వైఎస్సార్ సీపీదే

Mar 14 2014 11:44 PM | Updated on Jul 7 2018 2:52 PM

రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల కోఅర్డినేటర్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు.

రామచంద్రాపురం, న్యూస్‌లైన్:  రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ తెలంగాణ ప్రాంతంలో అధికారంలోకి రావడం ఖాయమని ఆ పార్టీ బీసీ సెల్ ఖమ్మం, హైదరాబాద్ జిల్లాల కోఅర్డినేటర్ సతీష్‌గౌడ్ పేర్కొన్నారు. శుక్రవారం రామచంద్రాపురం డివిజన్ బీసీ విభాగం క న్వీనర్‌గా జాక్సన్‌ను నియమిస్తూ  వైఎస్సార్ సీపీ రాష్ర్ట బీసీ విభా గం కన్వీనర్ గట్టు రామచంద్రారావు నియామకపత్రాన్ని హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో అందజేశారు. ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో బీసీ విభాగాన్ని మరింత బలోపేతం చేస్తామన్నారు.

 బీసీలకు రాజకీయంగా ప్రాధాన్యం వైఎస్సార్‌సీపీతోనే దక్కుతుందన్నారు. రానున్న రోజుల్లో వైఎస్సార్‌సీపీ రెండు రాష్ట్రాలలో అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. అన్ని వర్గాల ప్రజలకు సమాన్యాయం చేసే సత్తా కేవలం వైఎస్సార్‌సీపీకే ఉందన్నారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లి వివరిస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ విజయఢంకా మోగించడం ఖాయమన్నారు. ప్రజల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం చెందిందని విమర్శించారు.

 కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పేదవాడు రెండు పూటలా తినలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించడంలో కాంగ్రెస్ పాలకులు పూర్తిగా విఫలం చెందారని విమర్శించారు. మహానేత వైఎస్సార్ ప్రజల మధ్య లేకున్నా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొని ఉన్నారని కొనియాడారు. రానున్న రోజుల్లో గడపగడపకు వెళ్లి వైఎస్ ప్రవేశపెట్టిన పథకాలకు విస్తృత ప్రచారం కల్పిస్తామన్నారు. అనంతరం వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం డివిజన్ కన్వీనర్ జాక్సన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement