వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు | Attack on doctor in Medak | Sakshi
Sakshi News home page

వైద్యం సరిగా చేయలేదని డాక్టర్ కాళ్లు, చేతులు విరిచారు

Apr 1 2015 2:23 PM | Updated on Sep 2 2017 11:42 PM

వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు.

మెదక్: వైద్యం సరిగా చేయలేదని రోగి బంధువులు స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుడి కాళ్లు, చేతులు విరగ్గొట్టారు. ఆస్పత్రికి తీసుకు వచ్చిన ఒక రోగికి డాక్టర్ ఆశీర్వాదం వైద్యం చేశారు. అయితే వైద్యం సరిగా చేయలేదని అతని బంధువులు ఆగ్రహంతో డాక్టర్పై దాడి చేశారు.

ఈ దాడిలో డాక్టర్ ఆశ్వీర్వాదం కాళ్లు,చేతులు విరిగాయి. అతని పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఆసుపత్రికి తరలించారు. దాడి చేసినవారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సంఘటన వివరాలను పోలీసులు తెలుసుకుంటున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement