‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం | Ata invite to cm kcr | Sakshi
Sakshi News home page

‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం

May 22 2016 4:30 AM | Updated on Aug 14 2018 10:54 AM

‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం - Sakshi

‘ఆటా’ సభలకు సీఎంకు ఆహ్వానం

అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు.

సాక్షి, హైదరాబాద్: అమెరికన్ తెలుగు అసోసియేషన్ (ఆటా) మహాసభలకు ముఖ్య అతిథిగా రావాలని సీఎం కేసీఆర్‌ను ఆటా ప్రతినిధులు ఆహ్వానించారు. జూలై 1 నుంచి మూడు రోజుల పాటు షికాగో నగరంలో ఈ సభలను నిర్వహించనున్నారు. ఆటా వ్యవస్థాపకులు హన్మంతరెడ్డి, దామోదర్ రెడ్డి, అధ్యక్షుడు సుధాకర్, ఎలక్ట్ ప్రెసిడెంట్ కరుణాకర్, బోర్డ్ ఆఫ్ ట్రస్టీ ఉనుగు లక్ష్మణ్ తదితరులు శనివారం క్యాంపు కార్యాలయంలో సీఎంను కలిశారు. ఈ సభల్లో ప్రపంచం నలుమూలల నుంచి అనేక మంది తెలుగు ప్రముఖులు పాల్గొంటారని పేర్కొన్నారు. తమ ఆహ్వానానికి సీఎం సానుకూలంగా స్పందించారని అనంతరం వారు చెప్పారు. ఆటా ప్రతినిధులతో పాటు మంత్రి పద్మారావు, ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు సీఎంను కలిశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement