విద్యుత్ సబ్ ఇంజినీర్ పోస్టుల నోటిఫికేషన్ | Assistant Sub Engineer Notification released | Sakshi
Sakshi News home page

విద్యుత్ సబ్ ఇంజినీర్ పోస్టుల నోటిఫికేషన్

Jan 2 2016 9:57 PM | Updated on Sep 3 2017 2:58 PM

విద్యుత్ సంస్థల్లో సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమైంది.

హైదరాబాద్: విద్యుత్ సంస్థల్లో సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ల పరంపర ప్రారంభమైంది. దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (టీఎస్‌ఎస్పీడీసీఎల్) 153 సబ్ ఇంజినీర్(ఎలక్ట్రికల్) పోస్టుల భర్తీకి శనివారం ప్రకటన జారీ చేసింది. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా చేసిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. త్వరలో tssouthernpower.comవెబ్‌సైట్‌లో నోటిఫికేషన్‌ను ఉంచనున్నారు.

ఇదిలా ఉండగా.. త్వరలో ఉత్తర తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ (ఎన్పీడీసీఎల్) నుంచి 314, జెన్‌కో నుంచి 92, ట్రాన్స్‌కో నుంచి 174 సబ్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి ప్రకటనలు జారీ కానున్నాయి. ట్రాన్స్‌కో, జెన్‌కో, డిస్కంలలో 733 సబ్ ఇంజినీర్ పోస్టులతో పాటు 1948 అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి గత జూలైలోనే ప్రభుత్వం అనుమతులు జారీ చేసింది. ఇప్పటికే ఏఈ పోస్టుల రాత పరీక్షకు సంబంధించిన ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. త్వరలో తుది జాబితాలను ప్రకటించేందుకు విద్యుత్ సంస్థలు కసరత్తు చేస్తున్నాయి.
 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement

పోల్

Advertisement