ఆసిఫ్‌అలీ చేతిలో పటన్‌కుమార్ గుట్టు? | Sakshi
Sakshi News home page

ఆసిఫ్‌అలీ చేతిలో పటన్‌కుమార్ గుట్టు?

Published Thu, Aug 28 2014 12:54 AM

ఆసిఫ్‌అలీ చేతిలో పటన్‌కుమార్ గుట్టు?

సాక్షి, హైదరాబాద్: ఆర్మీ రహస్యాలను పాకిస్థాన్‌కు చెందిన మహిళకు  అందజేసిన  ఆర్మీ సుబేదార్ పటన్‌కుమార్ పోద్దార్‌కు చెందిన మరిన్ని రహస్యాలు ఇటీవల మీరట్‌లో పట్టుబడ్డ ఆర్మీ సుబేదార్ ఆసిఫ్‌అలీ  వద్ద ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇటీవల మీరట్‌లో పోలీసులకు పట్టుబడ్డ ఆసిఫ్‌అలీని హైదరాబాద్ తీసుకువచ్చి విచారించాలని యోచిస్తున్నారు. ఆసిఫ్‌అలీని కస్టడీలోకి తీసుకునేందుకు  పి.టి. వారంట్‌ను సీసీఎస్ అధికారులు మీరట్ కోర్టులో వేయనున్నారు. దీని ద్వారా పటన్‌కుమార్‌కు సంబంధించిన మరింత సమాచారం తమకు లభ్యం కావచ్చని భావిస్తున్నారు.  పశ్చిమ బెంగాల్ రాష్ట్రం మాల్దా జిల్లాకు చెందిన పటన్‌కుమార్ పూర్వీకులు  ఎక్కడి వారు అనే కోణం నుంచి కూడా నిఘా అధికారులు  సమాచారాన్ని సేకరిస్తున్నారు.  అదే సమయంలో వీరిద్దరినీ ఆర్మీలో చేర్చుకునే ముందు సివిల్ పోలీసులు సేకరించిన  ఎస్‌బీ రిపోర్టు గురించి కూడా అధికారులు ఆరా తీస్తున్నారు. వీరిద్దరిలో ఒకరు బంగ్లాదేశ్  కాందిశీకులనే సమాచారాన్ని కూడా నిర్ధారించుకునేందుకు యత్నిస్తున్నారు.

Advertisement
 
Advertisement
 
Advertisement