 
													ఓటీటీలు వచ్చాక మలయాళ చిత్రాలకు ఫుల్ డిమాండ్ పెరిగిపోయింది. ఇటీవల ఓటీటీల్లో మాత్రమే కాకుండా థియేటర్లలో సూపర్ హిట్‌గా నిలుస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు ఆడియన్స్ తెగ చూసేస్తున్నారు. సినిమా ఎప్పుడు రిలీజ్ అన్నది ముఖ్యం కాదు.. స్టోరీ ముఖ్యమంటున్నారు. దీంతో ఓటీటీల్లో మలయాళ సినిమాలకు ఆడియన్స్‌లో ఫుల్ క్రేజ్ వస్తోంది.
మలయాళంలో తెరకెక్కించిన మరో చిత్రం ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చేస్తోంది. అసిఫ్ అలీ, దివ్య ప్రభ జంటగా నటించిన సర్కీట్ మూవీ ఓటీటీలో సందడి చేయనుంది. ఈనెల 26 నుంచి సింప్లీ సౌత్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు మేకర్స్ వెల్లడించారు. అయితే కేవలం ఓవర్‌సీస్ ఆడియన్స్‌కు మాత్రమే అందుబాటులో ఉండనుందని ప్రకటించారు. 'ముగ్గురు ఆత్మలు. ఒక రోజు. ఒక మలుపు' అంటూ పోస్టర్‌ను పంచుకున్నారు.
కాగా.. ఈ చిత్రం మే 8న థియేటర్లలో విడుదలైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత ఓటీటీకి వస్తోంది. అయితే బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయిన ఈ మూవీ.. ఓటీటీలోనైనా రాణిస్తుందేమో వేచి చూడాల్సిందే. ఈ మూవీని ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది.
Three souls. One day. A turning point.#Sarkeet, streaming on Simply South from September 26 worldwide, excluding India. pic.twitter.com/YJjcbmJRwG
— Simply South (@SimplySouthApp) September 12, 2025

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
