ఎవరైనా.. ఎక్కడి నుంచైనా!

Anybody Can Complain On Cyber Crime Portal Says Warangal CP Ravinder - Sakshi

సైబర్‌ ఫిర్యాదుల కోసం ‘రిపోర్టింగ్‌ పోర్టల్‌’

బాధితులకు వీలుగా ఏర్పాటు

అవగాహన సదస్సులో పోలీసు కమిషనర్‌ రవీందర్‌

వరంగల్‌ క్రైం: సైబర్‌ నేరాలకు సంబంధించి ఇకపై ఎవరైనా.. ఎక్కడి నుంచైనా ఫిర్యాదు చేయొచ్చని వరంగల్‌ పోలీసు కమిషనర్‌ డాక్టర్‌ విశ్వనాథ రవీందర్‌ తెలి పారు. వరంగల్‌ పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో సోమవారం సైబర్‌ విభా గం ఆధ్వర్యాన ‘సైబర్‌ పోలీసు పోర్టల్‌’పై పోలీసు స్టేషన్ల రైటర్లకు ఒక రోజు శిక్షణ ఏర్పాటుచేశారు. ఈ సందర్బంగా సీపీ రవీందర్‌ మాట్లాడుతూ దేశంలో సైబర్‌ నేరాలను నియంత్రించి నేరస్తులను పట్టుకోవడంతో పాటు బాధితుల ఫిర్యాదులను ఎక్కడి నుంచైనా స్వీకరించేందుకుగాను కేంద్ర హోం మంత్రిత్వశాఖ ఇండియన్‌ సైబర్‌ క్రైం కోఆరి్డనేషన్‌ సెంటర్‌ పేరుతో పోర్టల్‌ను ప్రారంభించిందని తెలిపారు. దీని వల్ల సైబర్‌ బాధితులు నేరుగా ​​​​http://cybercrime.gov.in ద్వారా తమ నమోదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ పోర్టల్‌ ద్వార అందిన ఫిర్యాదులను రాష్ట్ర సైబర్, జిల్లా సైబర్‌ విభాగాల ద్వారా సంబంధించి పోలీసు స్టేషన్లకు బదిలీ చేస్తారని చెప్పారు. ఆ వెంటనే విచారణ ప్రారంభమవుతుందని వివరించారు.

కమిషరేట్‌లో ఓ కేసు
ఇటీవల కమిషనరేట్‌ పరిధిలో ఓ మహిళ వ్యక్తిగత ఫొటోలను పరిచయం ఉన్న వ్యక్తి ఫేస్‌బుక్‌లో పెట్టాడని సీపీ రవీందర్‌ తెలిపారు. ఈ విషయమై మహిళ ఫిర్యాదు చేయగా సైబర్‌ విభాగం అధికారులు ఫేస్‌బుక్‌లో ఫొటోలు తొలగింపచేశారని గుర్తు చేశారు. అంతేకాకుండా నిందితుడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఈ మేరకు సైబర్‌ క్రైం పోర్టల్‌పై సిబ్బంది అవగాహన పెంచుకోవడంతో పాటు ప్రజలకు వివరించాలని సూచించారు. సదస్సులో అడిషనల్‌ డీసీపీ వెంకటలక్ష్మి, సైబర్, ఐటీ కోర్‌ విభాగం ఇన్‌స్పెక్టర్లు జనార్దన్‌రెడ్డి, రాఘవేందర్, ప్రశాంత్, సైబర్‌ సిబ్బంది కిషోర్, రాజు, దినేష్, ఆంజనేయులు, రత్నాకర్, నరేష్‌ పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top