
‘భృతి’ కల్పించండి
మజ్దూర్‌సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు.
మజ్దూర్‌సంఘ్(బీఎంఎస్) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆందోళనకు జిల్లా నలుమూలల నుంచి కార్మికులు తరలివచ్చారు. సర్కస్‌గ్రౌండ్ నుంచి ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ ప్రధాన ద్వారం ఎదుట బైఠాయించారు. జీవనభృతి కోసం దరఖాస్తు ఫారాలు నింపి కరీంనగర్ ఆర్డీవోకు సమర్పించారు. ఆందోళనకు మద్దతు ప్రకటించిన బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రకటించినట్లుగా జీవనభృతి అందించాలని డిమాండ్ చేశారు.
బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు కలాల్ శ్రీనివాస్ మాట్లాడుతూ జిల్లాలో రెండు లక్షల మంది బీడీ కార్మికులు ఈ పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని, 26 రోజులు పని, కనీసవేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ఆర్డీవో చంద్రశేఖర్ హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో బీజేపీ నగర అధ్యక్షుడు బండి సంజయ్‌కుమార్, బీఎంఎస్ నాయకులు మోత్కూరి సుధీర్‌కుమార్, అలువాల తిరుపతి, ఇజ్జగిరి రాజన్న, డి.రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.