అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డు

Alert Identity Card Invented By Sneha From Sircilla - Sakshi

సిరిసిల్ల విద్యార్థిని మరో సృష్టి భౌతిక దూరమే లక్ష్యం

సిరిసిల్ల: కరోనా నియంత్రణలో భాగంగా భౌతిక దూరం పాటించడం ఇప్పుడు  అనివా ర్యమైంది. కొందరు ఆదమరిచి సమీపిస్తే అప్రమత్తం చేసే ఐడెంటిటీ కార్డును సిరిసిల్ల విద్యార్థిని స్నేహ రూపొందించారు. సిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన స్నేహ ఎలక్ట్రానిక్‌ సెన్సార్‌ ఐడెంటిటీ కార్డును తయారు చేశారు. ఆ కార్డును ధరించి మనం ఎటువెళ్లినా మీటర్‌ దూరం ఉండగానే ఎవరి దగ్గరికైనా మనం వెళ్లి, మన దగ్గరికి ఎవరు వచ్చినా వెంటనే ఐడీ కార్డు బీప్‌ సౌండ్‌ చేస్తుంది. దీంతో అప్రమత్తమై భౌతిక దూరం ఉండేందుకు అవకాశం ఉంటుంది. బీఎస్సీ ఎలక్ట్రానిక్స్‌S చదువుతున్న స్నేహ ఇప్పటికే సెన్సార్‌ స్మార్ట్‌వాచ్‌ రూపొందించి పలువురి అభినందనలు పొందారు. ఇప్పుడు అప్రమత్తం చేసే ఐడీ కార్డు రూపొందించి పలువురి మన్ననలు పొందారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top