స్ట్రాంగ్‌ రూంలకు బ్యాలెట్‌ బాక్సులు

Additional DGP Jithender Reddy Talks In Press Meet In Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్‌ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్‌ బాక్సులను ఎన్నికల నోడల్‌ అధికారుల గురువారం స్ట్రాంగ్‌ రూంకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్‌ డీజీ జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్‌ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్‌ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్‌ బాక్సులను స్ట్రాంగ్‌ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో 9, సైబరాబాద్‌ కమిషనరేట్‌ పరిధిలో 11 స్ట్రాంగ్‌ రూమ్‌లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద 144 సెక్షన్‌ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top