breaking news
ballet boxes
-
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేయాలా? ఇవి ఫాలో అవండి
సత్తుపల్లి: ఈ నెల 14న నల్లగొండ–ఖమ్మం–వరంగల్ జిల్లాల పట్టుభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. ఎమ్మెల్సీ ఓటింగ్ సాధారణ ఎన్నికల కంటే భిన్నంగా ఉంటుంది. అదెలాగో తెలుసుకుందాం. ఎన్నికల కమిషన్ సూచించిన గుర్తింపు కార్డు తీసుకుని పోలింగ్ కేంద్రానికి వెళ్లాలి. పోలింగ్ అధికారి బ్యాలెట్ పేపర్, పెన్ను ఇస్తారు. పేపర్‌పై పోటీ చేసిన అభ్యర్థుల పేరు, ఫొటో, పార్టీ లేదా స్వతంత్ర తదితర వివరాలు ఉంటాయి. బ్యాలెట్ పేపర్‌పై వారిచ్చే పెన్నుతోనే నంబర్ వేయాలి. ఈ సారి ఎన్నికల్లో 71 మంది బరిలో ఉన్నారు. మీరు మొదటి ప్రాధాన్యత ఇవ్వదలుచుకున్న అభ్యర్థి పేరు ఎదురుగా ఉండే బాక్సులో 1 అని నంబర్ వేయాలి. ఇలాగే రెండో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 2, మూడో ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థికి 3 అని అంకెలు వేయాలి. ఇలా 71 మందికీ మీ ప్రాధాన్యత క్రమంలో ఓటు వేయొచ్చు. లేకపోతే కొందరికైనా వేయొచ్చు. అయితే ప్రాధాన్యత క్రమం తప్పవద్దు. ఉదాహరణకు ఒక ఓటరు నలుగురికి ఓటువేద్దామనుకుంటే.. ఒకరికి 1, ఇతరులకు 2, 3, 4 ఇలా నంబర్లు వారి పేరుకు ఎదురుగా గల బాక్స్‌ల్లో రాయాలి. కౌంటింగ్ ఇలా.. ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ పెద్ద ప్రహాసనం. రెండు, మూడు రోజులు కౌంటింగ్ జరిగిన సందర్భాలు కూడా ఉన్నాయి. కౌంటింగ్‌కు ఏజెంట్‌కు వెళ్లాలంటేనే కనీసం రెండు రోజులు గడుపుతామనే భావన ఉంటుంది. మొత్తం పోలైన ఓట్లలో మొదటి ప్రాధాన్యత ఓట్లు 50 శాతం వచ్చిన వారిని గెలిచినట్లు ప్రకటిస్తారు. అలా రాని పక్షంలో రెండో ప్రాధాన్యత ఓటు లెక్కింపు చేపడతారు. ఉదాహరణకు 100 ఓట్లు పోలైతే 51 తొలి ప్రాధాన్యత ఓట్లు ఎవరికొస్తాయో వారే గెలిచినట్లు ప్రకటిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్లు ‘ఏ’అనే అభ్యర్థికి 46, బీ అనే అభ్యర్థికి 34 ఓట్లు, సీ అనే అభ్యర్థికి 10 ఓట్లు వచ్చాయనుకోండి. పోలైన ఓట్లలో 50 శాతం మొదటి ప్రాధాన్యత ఓట్లు ఎవరికీ రాలేదు. కాబట్టి వీరిలో ఎవరినీ విజేతగా ప్రకటించరు. ఇప్పుడు రెండో ప్రాధాన్యత ఓట్లు లెక్కిస్తారు. అతి తక్కువగా ఓట్లు పోలైన సీ అనే అభ్యర్థిని ఎలిమినేట్ చేసి, అతని ఓట్లలో రెండో ప్రాధాన్యత ఎవరికిచ్చారనే అనే అంశాన్ని పరిగణనలోకి తీసుకుంటారు. రెండో ప్రాధాన్యంలో ‘ఏ’అనే అభ్యర్థికి 2 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 18 ఓట్లు వచ్చాయనుకోండి. మొత్తం ‘ఏ’అనే అభ్యర్థికి 46+2=48 ఓట్లు, బీ అనే అభ్యర్థికి 34+18=52 ఓట్లు వచ్చినట్టు లెక్క. దీంతో బీ అనే అభ్యర్థి గెలిచినట్లు ప్రకటిస్తారు. గెలుపులో రెండో, మూడో ప్రాధాన్యత ఓట్లు కూడా కీలకంగా ఉంటాయి. సెలవులు కలిసొచ్చేనా..! పట్టణ ఓటర్లు ఓటు వేయాలంటే అంతగా ఆసక్తి చూపించరనేది ఇటీవల జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కన్పించింది. మార్చి 14న జరిగే ఎమ్మెల్సీ పోలింగ్‌కు ముందు వరుసగా నాలుగురోజులు సెలవులు వచ్చాయి. ఈ ప్రభావం పట్టణ ఓటర్లపై పడుతుందేమోనని ఒకింత ఆందోళన నెలకొంది. 11న మహాశివరాత్రి, 12న ష మేరాజ్(ఆప్షనల్ హాలీ డే), 13న రెండో శనివారం, 14న ఆదివారం రావటం అభ్యర్థులకు టెన్షన్‌కు గురిచేస్తోంది. పట్టణ ఓటర్లు సహజంగా వరుస సెలవులు వస్తే టూర్లకు వెళ్తుంటారు. గ్రామీణ ప్రాంతంలో ఓటర్లు పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న వారు వరుస సెలవులతో ఇంటికి వచ్చి ఓటు వేస్తారనే మరో అంచనా కూడా లేకపోలేదు. హైదరాబాద్, బెంగళూరు, వైజాగ్ తదితర పట్టణ ప్రాంతాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు చేస్తున్న పట్టుభద్రులు వరుస సెలవులతో ఇంటికి వచ్చేలా ప్రణాళికలు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇప్పటినుంచే వారితో ఆయా పార్టీల నాయకులు ఫోన్లలో సంప్రదింపులు జరుపుతున్నారు. 1,2,3.. నంబర్లే రాయాలి రోమన్ అంకెలు రాస్తే ఓటు చెల్లదు. ఒకటి, రెండు అని తెలుగు, ఇంగ్లిష్, హిందీ, ఉర్దూలో రాసినా, టిక్ చేసి న ఓటు చెల్లదు. బ్యాలెట్ పేపర్ మీద ఎటువంటి రాతలు రాసినా, సంతకం పెట్టినా ఓటు చెల్లదు. కేవలం 1,2,3 అని నంబర్లు మాత్రమే రాయాలి. చదవండి : (ఎవరి లెక్కలు వారివే.. ఎవరి ధీమా వారిదే..) (తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికలు: ఆ హాట్ సీటే టార్గెట్) -
స్ట్రాంగ్ రూం వద్ద 144 సెక్షన్ అమలు: జితెందర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మున్నిపల్ ఎన్నికలు ముగియడంతో బ్యాలెట్ బాక్సులను ఎన్నికల నోడల్ అధికారుల గురువారం స్ట్రాంగ్ రూంకు తరలించారు. ఈ సందర్భంగా అడిషనల్ డీజీ జితేందర్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ... పటిష్టమైన బందోబస్తు మధ్య బ్యాలెట్ బాక్సులను తరలించామని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 105 స్ట్రాంగ్ రూంలను ఏర్పాటు చేసి.. అధికారుల సమన్వయంతో బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్ రూంలకు తరలించామన్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 9, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 11 స్ట్రాంగ్ రూమ్‌లను ఏర్పాటు చేసి 5వేల మందితో భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రతి స్ట్రాంగ్ రూమ్‌ల వద్ద 144 సెక్షన్ అమలు చేసి, మూడేంచేల బలగాలతో భద్రత చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఈ నెల 25న ఫలితాలు విడుదల నేపథ్యంలో పటిష్టమైన బంధోబస్తును కూడా ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
నేడే పోలింగ్
తొలివిడత ప్రాదేశిక సమరానికి సర్వం సిద్ధం కర్నూలు(అర్బన్), న్యూస్‌లైన్ : జిల్లాలో ఆదివారం తొలి విడత ప్రాదేశిక ఎన్నికల పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు సర్వం సిద్ధం చేశారు. కర్నూలు, నంద్యాల డివిజన్లలోని 36 జెడ్పీటీసీ స్థానాలు, 496 ఎంపీటీసీ స్థానాలకు ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. కర్నూలు డివిజన్లోని 19 జెడ్పీటీసీ స్థానాలకు 73 మంది.. నంద్యాల డివిజన్లోని 17 జెడ్పీటీసీ స్థానాలకు 52 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. రెండు డివిజన్లలోని 496 ఎంపీటీసీ స్థానాలకు 1,311 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. పోలింగ్ కోసం 1,575 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 9,451 మంది సిబ్బంది ఎన్నికల విధులకు గాను శనివారం ఆయా గ్రామాలకు తరలివెళ్లారు.169 అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో 400 మంది ఇంజనీరింగ్ విద్యార్థుల సేవలను వినియోగించుకుంటున్నారు. ఆయా ప్రాంతాల్లోని పోలింగ్ సరళిని వెబ్ కాస్టింగ్ చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 400 మంది సూక్ష్మ పరిశీలకులను కూడా నియమించారు. ఎన్నికలు జరుగుతున్న మండలాలకు ఇప్పటికే బ్యాలెట్ బాక్సులు, బ్యాలెట్ పత్రాలను తరలించారు. మండలాల్లోని ఆర్ఓ, ఏఆర్ఓలు ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి అవసరమైన సామగ్రిని అందజేసి, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన సూచనలు, సలహాలను మరోసారి వివరించారు. పోలింగ్ ప్రక్రియ ముగిసిన అనంతరం సిబ్బంది తిరిగి గమ్యస్థానాలకు చేరుకునేందుకు.. బ్యాలెట్ బాక్సులను తీసుకొచ్చేందుకు అవసరమైన వాహనాలను సిద్ధం చేశారు. కర్నూలు డివిజన్‌కు సంబంధించి 57 జోన్లు.. 111 రూట్లను ఏర్పాటు చేయగా.. 76 జీపులు, 118 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను వినియోగిస్తున్నారు. నంద్యాల డివిజన్లోని 49 జోన్లు, 94 రూట్లకు 67 జీపులు, 97 ఆర్టీసీ, ప్రైవేట్ బస్సులను ఏర్పాటు చేశారు.