ఏసీబీ వలలో అవినీతి చేప | acb officers trapped vro | Sakshi
Sakshi News home page

ఏసీబీ వలలో అవినీతి చేప

May 30 2015 4:05 AM | Updated on Aug 17 2018 12:56 PM

ఏసీబీ వలలో అవినీతి చేప - Sakshi

ఏసీబీ వలలో అవినీతి చేప

ఏసీబీ అధికారులు పన్నిల వలలో ఓ రెవెన్యూ అధికారి శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం..

రూ. 3 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోరుున వీఆర్వో
ఆన్‌లైన్ పట్టాకోసం రైతును వేధించిన అధికారి
  ఏసీబీని ఆశ్రయించిన బాధితుడు
పక్కా ప్లాన్‌తో పట్టుకున్న ఏసీబీ అధికారులు

 మాచారెడ్డి : ఏసీబీ అధికారులు పన్నిల వలలో ఓ రెవెన్యూ అధికారి శుక్రవారం పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ నరేందర్‌రెడ్డి కథనం ప్రకారం..

మాచారెడ్డి మండలం ఘన్‌పుర్(ఎం), అక్కాపూర్ గ్రామాలలో ముత్తన్న వీ ఆర్వోగా పనిచేస్తున్నాడు. అక్కాపూర్ గ్రామానికి చెం దిన రైతు బేతి ఎల్లయ్య తన పట్టాపాస్‌బుక్‌లను ఆన్‌లైన్ చేయూలని ఏడాది కాలంగా వీఆర్వో చుట్టూ తిరుగుతున్నాడు. అయితే రూ. 5 వేలు లంచం ఇస్తేనే ఆన్‌లైన్ చేస్తానని వీఆర్వో చెప్పాడు. రైతు ఎంత బతిమిలాడినా వీఆర్వో ససేమిరా అనడంతో చివరకు రూ.3 వేలు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకున్నాడు. అంతేకాక ఖర్చుల పేరుతో రూ.వేయ్యి, రెండువేలు అడిగాడు. దీంతో చేసేది లేక ఎల్లయ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు.

వారు పధకం ప్రకారం ఎల్లయ్యకు రూ.3 వేలు ఇచ్చి మండల కేంద్రంలోని వీఆర్వో ఇం టికి పంపించారు. ఎల్లయ్య వీఆర్వోకు ఆ డబ్బు ఇ స్తుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని అదుపులోకి తీ సుకున్నారు. వీఆర్వోపై కేసు నమోదు చేసినట్లు డీఎ స్పీ తెలిపారు. ఎవరైనా ప్రభుత్వ అధికారులు డబ్బు లు ఇవ్వాలని వేధిస్తే 9440446155 నంబర్‌కు ఫోన్ చేయాలని సూచించారు. ఈ దాడిలో ఏసీబీ ఇన్స్‌పెక్ట ర్లు రఘునాథ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.
 
అధికారుల గుండెల్లో దడ..
వీఆర్వో ముత్తన్నపై ఏసీబీ అధికారులు దాడి చేయడంతో ఆయా శాఖలకు చెందిన పలువురు అధికారు ల గుండెల్లో దడ మొదలయినట్లు తెలుస్తోంది. గతం లో మాచారెడ్డిలో ఓ తహశీల్దార్, ఇద్దరు వీఆర్వోలు, ఒక బీఎస్‌ఎన్‌ఎల్ అధికారి ఏసీబీ వలలో చిక్కి కటకటాలపాలైన విషయం తెలిసిందే. తాజాగా ఘన్‌పూర్ వీఆర్వో ఏసీబీకి చిక్కడం చర్చనీయూంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement