హయత్ నగర్లో కిడ్నాప్ కలకలం | abducted doctor relleased in hayath nagar | Sakshi
Sakshi News home page

హయత్ నగర్లో కిడ్నాప్ కలకలం

Dec 30 2015 6:25 PM | Updated on Sep 3 2017 2:49 PM

హయత్‌నగర్‌లో ఓ డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది.

హైదరాబాద్‌ సిటీ: హయత్‌నగర్‌లో ఓ డాక్టర్ కిడ్నాప్ కలకలం సృష్టించింది. అరణ్య కాలనీలో ఉంటున్న బొర్ర రమేశ్ గౌడ్ అనే డాక్టర్‌ను గుర్తుతెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. హయత్‌నగర్ పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..బొర్ర రమేశ్ గౌడ్, దుర్గా రాణి అనే ఇద్దరు గతంలో ఓ ఆసుపత్రి పెట్టారు. విభేదాలు రావడంతో ఆసుపత్రిలో వాటాను రమేశ్ అమ్మేసుకున్నాడు. దీనికిగానూ దుర్గారాణి, రమేశ్‌కు రూ.30 లక్షల విలువైన చెక్‌లను ఇచ్చింది. ఆ చెక్‌లు చెల్లకపోవడంతో రమేశ్ పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ కేసు ప్రస్తుతం నడుస్తోంది.

మరో క్లినిక్ ప్రారంభిద్దామని రమేశ్ మంగళవారం ఉదయం 10 గంటల సమయంలో పోచంపల్లి వెళ్తుండగా కొత్తగూడెం చౌరస్తా వద్ద కారులో వచ్చిన ఆరుగురు దుండగులు ఆయనను కిడ్నాప్ చేశారు. కరీంనగర్‌లోని ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్నారు. తాము మావోయిస్టులమని ఈ విషయం ఎవరికైనా చెబితే భార్యాబిడ్డలను హతమారుస్తామని బెదిరించారు. అనంతరం రమేశ్‌ను ఘట్‌కేసర్ వద్ద విడిచిపెట్టి పారిపోయినట్లు తెలిసింది. బాధితుడి ఫిర్యాదు మేరకు హయత్‌నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement