పింఛన్ రాలేదని.. మతిస్థిమితం కోల్పోయాడు | A man go Insane worry about pension | Sakshi
Sakshi News home page

పింఛన్ రాలేదని.. మతిస్థిమితం కోల్పోయాడు

Dec 25 2014 2:30 AM | Updated on May 24 2018 1:33 PM

పింఛన్ రాలేదన్న బెంగతో మెదక్ జిల్లా ఆందోలు మండలం చింతకుంటలో ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామానికి చెందిన నీరుడి దుర్గయ్య వికలాంగుడు.

జోగిపేట: పింఛన్ రాలేదన్న బెంగతో మెదక్ జిల్లా ఆందోలు మండలం చింతకుంటలో ఓ వ్యక్తి మతిస్థిమితం కోల్పోయాడు. గ్రామానికి చెందిన నీరుడి దుర్గయ్య వికలాంగుడు. 2 నెలల కిందటి వరకు ప్రభుత్వమిచ్చే వికలాంగ పింఛన్ రూ.500 పొందేవాడు. తాజా పింఛన్ జాబితాలో దుర్గయ్య పేరు లేకపోవడంతో కలత చెంది మతిస్థిమితం కోల్పో యాడు. స్వారూప్స్ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులు బుధవారం దుర్గయ్యను హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ మానకసిక వికలాంగుల ఆస్పత్రిలో చేర్పించారు.
 
 పింఛన్ రాదేమోనన్న బెంగతో ముగ్గురి మృతి
 పింఛన్ రాదేమోనన్న బెంగతో వేర్వేరు ప్రాంతాలకు చెందిన ముగ్గురు వృద్ధులు మృతి చెందారు. రంగారెడ్డి జిల్లా మోమిన్‌పేట మండలం ఏన్కతలకు చెందిన కౌడి కిష్టమ్మ(70), మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండలం ఆర్కపల్లికి చెందిన దూదేకుల లాల్‌బీ(71), కరీంనగర్ జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లికి చెరందిన పొన్నాల గాలవ్వ (80) పింఛన్ రాలేదని మనస్తాపం చెంది మరణించారు.
 
 అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
 దౌల్తాబాద్: మెదక్ జిల్లా దౌల్తాబాద్ మండలం లింగాయపల్లితండాకు చెందిన బానోతు రవి (28) అప్పుల బాధతో మంగళవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. తనకున్న ఎకర పొలంతో పాటు మరో 4 ఎకరాలను కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. వర్షాభావంతో పంట దెబ్బతినింది. దీంతో బోర్ల కోసం చేసిన రూ.2 లక్షల అప్పు తీర్చే మార్గం కనిపించక తీవ్ర ఆందోళన చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement