ట్రావెల్స్ బస్సు - కంటేనర్ ఢీ..ఒకరు మృతి | 6 injuered in road accident | Sakshi
Sakshi News home page

ట్రావెల్స్ బస్సు - కంటేనర్ ఢీ..ఒకరు మృతి

May 6 2015 6:37 AM | Updated on Aug 30 2018 3:56 PM

వేగంగా వెళ్లాలనే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది.

నల్లగొండ: వేగంగా వెళ్లాలనే ప్రయత్నంలో ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయడానికి ప్రయత్నించిన ట్రావెల్స్ బస్సు దాన్ని ఢీకొని ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న విశాఖకి చెందిన అవినాష్(30)అనే విద్యార్థి మృతి చెందగా మరో 10మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా సూర్యాపేట శివారులోని సువెన్ ఫ్యాక్టరి సమీపంలో బుధవారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సు ప్రయాణికులతో విజయవాడ వెళ్తోంది. సువెన్ ఫ్యాక్టరి సమీపంలోకి చేరుకోగానే ముందు వెళ్తున్న కంటేనర్‌ను వెనకనుంచి ఢీకొట్టింది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement