ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు | 5 injured as Auto overturns | Sakshi
Sakshi News home page

ఆటో బోల్తా: ఐదుగురికి గాయాలు

Dec 28 2015 4:35 PM | Updated on Sep 3 2017 2:42 PM

బొడ్రాయి పండుగకు వెళ్లి వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి.

హాలియ (నల్లగొండ) : బొడ్రాయి పండుగకు వెళ్లి వస్తున్న ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టడంతో.. ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన నల్లగొండ జిల్లా హాలియ మండలం జానీరెడ్డి కాలనీలో సోమవారం చోటుచేసుకుంది. పెద్దవూర మండలం పూలగూడెం గ్రామంలో బొడ్రాయి మహోత్సవానికి వెళ్లి వస్తున్న సమయంలో ఆటో అదుపుతప్పి బోల్తా కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఐదుగురూ గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు వారిని నాగార్జున సాగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement