ఆ ఒక్కడు... ఐదుగురికి దేవుడు! | 45 years old donated organs | Sakshi
Sakshi News home page

ఆ ఒక్కడు... ఐదుగురికి దేవుడు!

Apr 4 2015 11:33 PM | Updated on Sep 2 2017 11:51 PM

మృత్యువు ముంగిట నిలిచినా, మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టి చిరంజీవిగా నిలిచాడు ఓ వ్యక్తి!

హైదరాబాద్: మృత్యువు ముంగిట నిలిచినా, మరో ఐదుగురి ప్రాణాలు నిలబెట్టి చిరంజీవిగా నిలిచాడు ఓ వ్యక్తి! వరంగల్ నగరానికి చెందిన బెన్సన్(46) కొన్ని రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తుల దాడిలో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబ సభ్యులు జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చేర్చగా... చికిత్స పొందుతూ శనివారం ఉదయం 11 గంటలకు మృతి చెందాడు.

 

బ్రెయిన్‌డెడ్ అయినట్లు అపోలో వైద్యులు ధ్రువీకరించారు. దీంతో బెన్సన్ భార్య కొమ్ము సరోజ అవయవదానానికి అంగీకరించారు. బెన్సన్ కళ్లు, ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె నాళాలను సేకరించిన వైద్యులు వాటిని జీవన్‌దాన్ ట్రస్టుకు శనివారం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement