నలుగురు విద్యార్థులు అదృశ్యం | 4 students disappeared from school in Rangareddy | Sakshi
Sakshi News home page

నలుగురు విద్యార్థులు అదృశ్యం

Nov 22 2017 10:25 AM | Updated on Sep 15 2018 4:12 PM

కొత్తూరు: రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలం ఫాతిమాపూర్లోని ఫాతిమా స్కూలు విద్యార్థులు నలుగురు అదృశ్యమయ్యారు. ఎనిమిదవ తరగతి చదువుతున్న డి.ఇమ్ములనర్వకు చెందిన అజీజ్, నందిగామ మండలం నర్సప్పగూడకు చెందిన ప్రవీణ్‌, హైదరాబాద్‌ జియాగూడకు చెందిన దేవీశ్రీ ప్రసాద్‌, కొత్తూరు మండలం సెరిగూడ భద్రాయిపల్లికి చెందిన మధుసూదన్‌గౌడ్‌లు అదృశ్యమయ్యారు. మంగళవారం టీచర్‌ కొట్టాడని వీరంతా పారిపోయారు. కొత్తూరు పోలీసు స్టేషన్‌లో వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. మధుసూదన్ గౌడ్ తల్లి సరస్వతి ఫిర్యాదు మేరకు పాఠశాల యాజమాన్యం, వ్యాయామ ఉపాధ్యాయుడు శేఖర్‌లపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement