విద్యుత్ శాఖలో 2,681 ఇంజనీర్ల నియామకాలు | 2681 engineers recruited in power corporation | Sakshi
Sakshi News home page

విద్యుత్ శాఖలో 2,681 ఇంజనీర్ల నియామకాలు

Feb 12 2015 4:39 AM | Updated on Sep 2 2017 9:09 PM

విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులతో పాటు కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ అవసరాలకై పోస్టులను సృష్టిం చి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.

హైదరాబాద్: విద్యుత్ శాఖలో ఖాళీ పోస్టులతో పాటు కొత్త విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ అవసరాలకై పోస్టులను సృష్టిం చి వాటిని భర్తీ చేయాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు. ఈ మేరకు విద్యుత్ శాఖ కార్యదర్శి అరవింద్ కుమార్, జెన్‌కో చైర్మ న్ ప్రభాకర్‌రావులతో బుధవారం సచివాలయంలో సమీక్షించారు. 1,948 మంది అసిస్టెంట్ ఇంజనీర్లు, 733 మంది సబ్ ఇంజనీర్లు కలిపి మొత్తం 2,681 మంది ఇంజనీర్లను నియమించాలని నిర్ణయించా రు. జెన్‌కోలో 1,080, ట్రాన్స్‌కోలో 398, ఎస్పీడీసీఎల్‌లో 580మంది, ఎన్పీడీసీఎల్ లో 623 మందిని నియమించనున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement