టికెట్‌ ప్లీజ్‌ ! 

2019 Lok Sabha Election Mahabubnagar Politics - Sakshi

మహబూబ్‌నగర్‌ మున్సిపాలిటీ: ఉమ్మడి జిల్లాలో పార్లమెంట్‌ ఎన్నికల కోలాహలం నెలకొంది. ఇటీవల వరుసగా జరిగిన అసెంబ్లీ, గ్రామపంచాయతీల ఎన్నికల్లో తలమునకలైన ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు తాజాగా లోక్‌సభ ఎన్నికలపై దృష్టి సారించాయి. ఇంకా మూడు నెలల పాటు సిట్టింగ్‌ ఎంపీల పదవీ కాలం ఉన్నా.. అభ్యర్థుల ఎంపికపై వివిధ పార్టీలు ఇప్పటికే కసరత్తు ప్రారంభించాయి. దీంతో షెడ్యూల్‌ కూడా రాకముందే టికెట్ల కోసం ఆశావహుల లాబీయింగ్‌ జోరందుకుంది.

దరఖాస్తుల ఆహ్వానం 
రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయదలిచిన వారు దరఖాస్తు చేసుకోవాలని కాంగ్రెస్‌ అధిష్టానం ప్రకటించింది. ఈనెల 16వ తేదీ లోగా దరఖాస్తులు సమర్పించాలని సూచించగా.. పలువురు ఇప్పటికే తమ వివరాలను డీసీసీ, పీసీసీ అధ్యక్షులకు అందజేశారు. అంతేకాకుండా పార్లమెంట్‌ నియోజకవర్గాల పరిధిలో జోరుగా పర్యటనలు సాగిస్తున్నారు. పార్టీ శ్రేణులను కలుస్తూ సమావేశాల్లో పాల్గొంటూ తామే అభ్యర్థులుగా పోటీకి దిగనున్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. ఇక బీజేపీ విషయానికి వస్తే ఈనెల 11వ తేదీన కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా జరిగిన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్‌ పార్లమెంట్‌ నియోజకవర్గాల స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆమె లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం సాగించాల్సిన తీరు.. కేంద్రప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో లోక్‌సభ ఎన్నికల వేడి రాజుకున్నట్లయింది.

మహబూబ్‌నగర్‌ ఎంపీ స్థానానికి... 
మహబూబ్‌నగర్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ తరఫున ఏపీ.జితేందర్‌రెడ్డి ఎంపీగా కొనసాగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల మా దిరిగానే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా కూడా టీఆర్‌ఎస్‌ అధిష్టానం సిట్టింగ్‌లకే టికెట్లు ఇస్తుందనే ప్రచారం సాగుతోంది. త ద్వారా ఈ స్థానం మళ్లీ జితేందర్‌రెడ్డికి ఖాయమైనట్లేనని చె బుతున్నారు. బీజేపీ నుంచి జిల్లా మాజీ అధ్యక్షుడు రతంగ్‌ పాం డురెడ్డి టికెట్‌ ఆశించినా బీసీ వర్గానికి(మున్నూరు కాపు) చెం దిన ఆ పార్టీ రాష్ట్ర కోశాధికారి బి.శాంతికుమార్‌ను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. కాగా కాంగ్రెస్‌ నుంచి ఎంపీ స్థానం కోసం ఆశావహులు పెద్దసంఖ్యలో ఉండడంతో పోటీ నెలకొంది.

ఈ మేరకు పలువురు డీసీసీ, టీపీసీసీకి దరఖాస్తులు అందజేయగా.. కొందరు ఢిల్లీ స్థాయిలో పైరవీలు ప్రారంభించారు. కేంద్ర మాజీ మంత్రి సూదిని జైపాల్‌రెడ్డి చుట్టూ పార్లమెంట్‌ రాజకీయాలు సాగినా.. ఇటీవలి శాసనసభ ఎన్నికల్లో ఊహకందని రీతిలో ఫలితాలు వచ్చాయి. ఈ పార్లమెంట్‌ స్థానం పరిధిలోని ఏడు ఎమ్మెల్యే సీట్లు టీఆర్‌ఎస్‌కు భా రీ మెజార్టీతో దక్కడం.. కాంగ్రెస్‌ అధినేత రాహుల్‌ గాంధీ సైతం జూనియర్లకు ప్రాధాన్యం ఇస్తారన్న నేప«థ్యంలో జైపాల్‌రెడ్డి స్థానంపై సందిగ్ధత నెలకొంది. కాగా, ఈ స్థానం నుంచి మాజీ మంత్రి డీకే.అరుణ, మాజీ ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, డా క్టర్‌ వంశీచంద్‌రెడ్డి పోటీ చేయాలని భావిస్తూ ఢిల్లీలో తమ వం™ è ు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఈ ముగ్గురికీ ఏఐసీసీ నేతలతో సత్సంబంధాలు ఉండడంతో వారిలోనే ఒకరికి ఎంపీ టికెట్‌ వస్తుందని కాంగ్రెస్‌ శ్రేణులు భావిస్తున్నారు.

నాగర్‌కర్నూల్‌ నుంచి.... 
నాగర్‌కర్నూల్‌ లోక్‌సభ స్థానం నుంచి టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా మాజీ మంత్రి పి.రాములు, బీజేపీ నుంచి ఆ పార్టీ మాజీ జా తీయ అధ్యక్షులు బంగారు లక్ష్మణ్‌ కుమార్తె బంగారు శృతికి టి కెట్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్‌ నుంచి సిట్టింగ్‌ ఎంపీ నంది ఎల్లయ్య, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి, ఆలంపూర్‌ మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌తో పాటు అచ్చంపేటకు చెందిన జెడ్పీటీసీ డాక్టర్‌ అనురాధ, మాజీ మంత్రి శంకర్‌రావు, రాష్ట్ర నాయకులు సతీశ్‌ మాదిగ, మానవతారాయ్‌ టికెట్‌ కోసం తమ వంతు ప్రయత్నాలు చేసుకుంటున్నారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top