హన్మకొండ బస్టాండ్‌లో 200 మంది ప్రయాణీకులు హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక పడిగాపులు కాస్తున్నారు.
వరంగల్: హన్మకొండ బస్టాండ్‌లో 200 మంది ప్రయాణీకులు హైదరాబాద్ వెళ్లేందుకు బస్సులు లేక పడిగాపులు కాస్తున్నారు. వారాంతాన్ని సొంతూరులో గడిపేందుకు నగరం నుంచి వచ్చి తిరిగి ప్రయాణమయిన వారికి బస్సు సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారు. వారాంతం అని తెలిసి కూడా ఆర్టీసీ అధికారులు సరైన ఏర్పాట్లు చేయలేదని ప్రయాణీకలు వాపోతున్నారు.