మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
కట్టంగూరు: మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ సంఘటన మంగళవారం నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం చెరువు అన్నారం గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జరిగింది. వివరాలు.. గ్రామంలోని ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించడంతో 20 మంది విద్యార్థులు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. దాంతో వారందరినీ మెరుగైన వైద్యం కోసం నకిరేకల్‌లోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పిల్లలు మధ్యాహ్నం చారు, కూరగాయలతో భోజనం చేసినట్లు సమాచారం.