పిచ్చి కుక్క కరవడంతో పన్నెండు మందికి గాయాలయ్యాయి.
అదిలాబాద్: పిచ్చి కుక్క కరవడంతో పన్నెండు మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అదిలాబాద్ జిల్లా ఉట్నూరు మండల కేంద్రంలోని నవోదయనగర్‌లో జరిగింది. బుధవారం మధ్యాహ్నం ఆర్‌డీఓ కార్యాలయం నుంచి బయటకు వస్తున్న తాండూర్ తహశీల్దార్ రాజేశ్వర్ పై పిచ్చి కుక్క దాడి చేసి గాయపరిచింది.
ఆ తర్వాత శాంతినగర్, హనుమాన్ నగర్ ప్రాంతాల్లో తిరుగుతూ మరో పన్నెండు మందిపై దాడి చేసింది. గాయాలపాలైన వారిని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.