పిడుగుపాటుతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా వాసులు మంగళవారం తండా శివారులో దాటుడు పండుగ జరుపుకున్నారు.
మహబూబాబాద్ (వరంగల్): పిడుగుపాటుతో 12 మంది అస్వస్థతకు గురయ్యారు. వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం వస్రాం తండా వాసులు మంగళవారం తండా శివారులో దాటుడు పండుగ జరుపుకున్నారు. తండావాసులంతా పండుగ సంబరాల్లో మునిగిపోయిన సమయంలో సాయంత్రం భారీ వర్షం కురిసింది. దీంతో కొంతమంది సమీపంలో ఉన్న పశువుల కొట్టంలోకి వెళ్లారు.
అదే సమయంలో పశువుల కొట్టం సమీపంలో పిడుగు పడింది. ఆ పిడుగు ప్రభావానికి కొట్టంలో ఉన్న భూక్య నరేష్, భూక్య సోమ్లా, భూక్య బుల్కి, కల్పన, మోహన్, బాజు, రామ, చీన్యా, సోమ్లితో పాటు మరో ముగ్గురు సొమ్మసిల్లి పడిపోయారు. వారిని మానుకోట ఏరియా ఆసుపత్రికి తరలించారు. వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు.