108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా జీవీకే యాజమాన్యం వారిపై దారుణంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు.
హైదరాబాద్: 108 ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించకుండా జీవీకే యాజమాన్యం వారిపై దారుణంగా వ్యవహరిస్తుందని తెలంగాణ రాజకీయ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం విమర్శించారు. గురువారం ఇందిరా పార్కు వద్ద 108 ఉద్యోగుల ధర్నాలో కోదండరాం మాట్లాడుతూ వీరి సమ్మెకు తెలంగాణ జేఏసీ మద్దతు ఇస్తుందన్నారు. ప్రభుత్వం స్పందించి జీవీకే యాజమాన్యంతో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని కోరారు.
ప్రొఫెసర్ హరగోపాల్ మాట్లాడుతూ.. 108 ఉద్యోగుల డిమాండ్‌లను పరిష్కరించి సమ్మెను విరమింపజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీఎన్‌జీఓ అధ్యక్షుడు ప్రవీణ్ రెడ్డి, 108 ఉద్యోగుల వేల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి పాల్గొన్నారు.