టిప్పర్ భీభత్సం.. 10 కార్లు ధ్వంసం | 10 cars damaged by hitting tipper due to break fail | Sakshi
Sakshi News home page

టిప్పర్ భీభత్సం.. 10 కార్లు ధ్వంసం

Dec 24 2014 5:46 AM | Updated on Sep 2 2017 6:41 PM

గచ్చిబౌలి విప్రో జంక్షన్‌లో మంగళవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది.

హైదరాబాద్: గచ్చిబౌలి విప్రో జంక్షన్‌లో మంగళవారం ఓ టిప్పర్ బీభత్సం సృష్టించింది. గచ్చిబౌలి నుంచి విప్రో జంక్షన్ వైపు వెళుతున్న టిప్పర్‌కు బ్రేకులు ఫెయిల్ కావడంతో ముందుగా వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఆ కారు దాని ముందు వెళ్తున్న కారును ఢీకొట్టింది. ఇలా పది కార్లు ఒకదానికొకటి ఢీకొట్టుకోవడంతో ఆ వాహనాలన్నీ దెబ్బతిన్నాయి. ఐదు కార్లు పూర్తిగా దెబ్బతిన్నట్లు పోలీసులు వెల్లడించారు. చివరకు టిప్పర్ విప్రో కంపెనీ ప్రహరీని ఢీకొని ఆగిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement