గిరిజ మృతదేహం వెలికితీత | గిరిజ మృతదేహం వెలికితీత | Sakshi
Sakshi News home page

గిరిజ మృతదేహం వెలికితీత

Oct 15 2014 3:14 AM | Updated on Mar 28 2018 11:05 AM

గిరిజ మృతదేహం వెలికితీత - Sakshi

గిరిజ మృతదేహం వెలికితీత

చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది.

ఇబ్రహీంపట్నం/మంచాల: చిన్నారి గిరిజ మృతి చెందింది. మూడు రోజులుగా కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్ మంగళవారం రాత్రి ముగిసింది. రంగారెడ్డి జిల్లా మంచాల గ్రామ సమీపంలోని బోరుబావి నుంచి ఐదేళ్ల చిన్నారి గిరిజ మృతదేహాన్ని రాత్రి 8:15 నిమిషాల ప్రాంతంలో రెస్క్యూటీం బయటకు తీసింది. 56 గంటలపాటు గా కొనసాగిన ఈ ఆపరేషన్ అనంతరం గిరిజ మృతదేహం బయటకు రాగలింది.

చిన్నారి మృతిని అధికారికంగా సోమవారం మధ్యాహ్నమే ధ్రువీకరించినా.. మృతదేహం వెలికితీతకు మరింత సమయం పట్టింది. 45 అడుగుల లోతులో కూరుకుపోయి న గిరిజ మృతదేహం ఉబ్బిపోవడం వెలికితీతకు అవరోధం అయింది. చివరకు గిరిజ మృతదేహాన్ని కేసింగ్ పైపుల ద్వారా లాగారు. 50 శాతం శరీర భాగాలను మాత్రమే వెలికితీశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు.
 
 

Advertisement
 
Advertisement
Advertisement